Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ ఫోకస్ చేంజ్.! నెక్స్ట్ ఆయనే టార్గెట్..
గుంటూరు కారం రిలీజ్ అయిపోయింది. ఇక రిజల్ట్ విషయం ఫ్యాన్స్ చేతిలో ఉంది.. దీంతో ఫోకస్ నెమ్మదిగా మహేష్ నెక్ట్స్ మూవీ మీదకు షిప్ట్ అవుతోంది. ఆల్రెడీ జక్కన్నతో మూవీ కమిట్ అయిన మహేష్ ఆ సినిమా వర్క్‌లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాజమౌళి, మహేష్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం వైబ్ చూసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి.