Suryakumar Yadav: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సూర్యా భాయ్ మళ్లీ వచ్చేశాడు.. ప్రాక్టీస్ ప్రారంభం
టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేల్లో ఎలా ఆడినా పొట్టి ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతాడీ మిస్టర్ 360 ప్లేయర్. అలాంటి ప్లేయర్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్య తీవ్రంగా గాయపడ్డాడు,

టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేల్లో ఎలా ఆడినా పొట్టి ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతాడీ మిస్టర్ 360 ప్లేయర్. అలాంటి ప్లేయర్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్య తీవ్రంగా గాయపడ్డాడు, దీని కారణంగా అతను టీమిండియాకు దూరం కావాల్సి వచ్చింది. ఆ మధ్యన వాకింగ్ స్టిక్స్ సహాయంతో నడుస్తూ కనిపించాడు సూర్య. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ ఆడలేదు సూర్య. ఐపీఎల్ 2024 సీజన్, అలాగే టీ20 ప్రపంచ కప్ 2024లోనూ ఆడతాడా? లేదా? అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు సూర్య ఫిట్‌నెస్ గురించి ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఇప్పుడిప్పుడే గాయం నుంచి క్రమంగా కోలుకుంటోన్న సూర్య తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడు. తాజాగా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడీ మిస్టర్ 360 ప్లేయర్. ఈ ఫొటోలను చూసిన టీమిండియా అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. సూర్య ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు సూర్య కానీ, ముంబై ఇండియన్స్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు.
ఐపీఎల్ సంగతి పక్కప పెడితే ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. మొత్తం 20 జట్లు పాల్గొనే టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టీ20 ప్రపంచకప్‌కు పెద్దగా సమయం కూడా లేదు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఎంత త్వరగా ఫిట్‌నెస్ సాధిస్తే భారత జట్టుకు అంత మంచిది. ఇక ఆదివారం (జనవరి 14) భారత్, అప్గనిస్తాన్ జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇక మూడో మ్యాచ్ జనవరి 17న బెంగళూరులో జరగనుంది.
బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న సూర్య కుమార్ యాదవ్..
Good News For all SKY Fans 🥹❤️ SKY has started batting in nets. Can’t wait to see him on field 😭#SuryaKumarYadav pic.twitter.com/GP2B7WJ49S
— ✰ (@imsheenusingh63) January 12, 2024
ఐపీఎల్ లో ఆడడంపై నో క్లారిటీ..
Good news for India & Mumbai Indians.
– Suryakumar Yadav has started batting in nets. pic.twitter.com/ivVU9KrWva
— Johns. (@CricCrazyJohns) January 12, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








