AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs ZIM: 5.5 ఓవర్లు..19 రన్స్‌.. 7 వికెట్లు.. కోహ్లీ టీమ్‌కు తగిన బుద్ధి చెప్పిన సన్‌రైజర్స్‌ బౌలర్‌

5 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా 19 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి జట్టు లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. 97 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది శ్రీలంక. ఈ మ్యాచ్‌లో హసరంగ 5.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 1 మెయిడిన్ ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు

SL vs ZIM: 5.5 ఓవర్లు..19 రన్స్‌.. 7 వికెట్లు.. కోహ్లీ టీమ్‌కు తగిన బుద్ధి చెప్పిన సన్‌రైజర్స్‌ బౌలర్‌
Wahindu Hasaranga
Basha Shek
|

Updated on: Jan 13, 2024 | 9:08 AM

Share

జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక జట్టు 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు డక్ వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు గుంబై, కైటానో తొలి వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభం అందించారు. అయితే ఎప్పుడైతే వహిందు హసరంగా బౌలింగ్‌కు వచ్చాడో జింబాబ్వే జట్టు కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా జింబాబ్వే జట్టు మొత్తం 96 పరుగులకే ఆలౌటైంది. 5 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా 19 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి జట్టు లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. 97 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది శ్రీలంక. ఈ మ్యాచ్‌లో హసరంగ 5.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 1 మెయిడిన్ ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. 97 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. కెప్టెన్ కుశాల్ మెండిస్ 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు,మూడు వన్డేలు లంక గెలిచి వన్డే సిరీస్ ను 2-0 తేడాతో గెలిచింది.

కాగా త‌న ఈ ఇన్నింగ్స్ తో హ‌స‌రంగ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. వ‌న్డేల‌లో అత్యుత్తమ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదుచేసిన టాప్-5 బౌల‌ర్ల లిస్టులో చోటు సంపాదించాడీ శ్రీలంక స్టార్ స్పిన్నర్‌. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండు, మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి సిరీస్ ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. తన సంచలన బౌలింగ్‌లో ఐపీఎల్‌లో తనను జట్టు నుంచి తప్పించిన ఆర్సీబీకి తగిన సమాధానం చెప్పాడు హసరంగ. ఐపీఎల్‌ మినీ వేలానికి ముందు RCB ఫ్రాంచైజీ తమ జట్టు నుండి వనిందు హసరంగాను విడుదల చేసింది. ఆ తర్వాత మినీ వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.2 కోట్ల బేస్ ధరకు హసరంగాను కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఏడు వికెట్లతో సూపర్ స్పెల్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..