AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Saamiranga: సంక్రాంతికి సత్తా చాటుతోన్న నాగ్.. ‘నా సామిరంగ’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

ఘోస్ట్ మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న నాగార్జున.. ఈసారి విలేజ్ మాస్ డ్రామాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీకి ఫ్యామిలీ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించగా.. ఎమ్ఎమ్ కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. అటుఈ చిత్రంలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సాలిడ్ మాస్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది.

Naa Saamiranga: సంక్రాంతికి సత్తా చాటుతోన్న నాగ్.. 'నా సామిరంగ' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
Naa Saamiranga
Rajitha Chanti
|

Updated on: Jan 16, 2024 | 12:20 PM

Share

సంక్రాంతి బరిలో చివరిగా విడుదలైన సినిమా నా సామిరంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన ఈ సినిమా ఈనెల 14న అడియన్స్ ముందుకు వచ్చింది. ఘోస్ట్ మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న నాగార్జున.. ఈసారి విలేజ్ మాస్ డ్రామాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీకి ఫ్యామిలీ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించగా.. ఎమ్ఎమ్ కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. అటుఈ చిత్రంలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సాలిడ్ మాస్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. తొలిరోజు రూ.4.33 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక రెండో రోజు రూ. 4.55 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. మొత్తం మీద రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 18.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో కలిపి మొత్తం రూ. 8.88 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా నైజాంలో అత్యధికంగా వసూళ్లు రాబట్టింది.

నిన్న సంక్రాంతి పండగా సందర్భంగా ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరిగాయి. సోమవారం నైజాం ఏరియాలో రూ.1.47 కోట్లు.. సీడెడ్ లో రూ.76 లక్షలు, వైజాగ్ లో రూ.57 లక్షలు.. ఈస్ట్ గోదావరిలో రూ.54 లక్షలు.. గుంటూరులో రూ.41 లక్షల వసూళ్లు రాబట్టింది. అలాగే వెస్ట్ గోదావరిలో రూ.34 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా విడుదల కాగా.. మరో పది కొట్లు రాబడితే ఈ సినిమా లాభాల్లోకి ఎంటరైనట్లే. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న నాగ్.. ఈసారి సంక్రాంతికి మాత్రం సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇదిలా ఉంటే..ఈ సినిమాతో దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు విజయ్ బిన్ని. మలయాళంలో సూపర్ హిట్ అయిన పురింజు మరియం జోస్ రీమేక్ గా తెరకెక్కింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. అటు మ్యూజిక్ పరంగానూ మెప్పించింది. ఈ సంక్రాంతికి ఏకంగా నాలుగు చిత్రాలు విడుదల కాగా.. అన్నింటికంటే చివరగా జనవరి 14న ఈ చిత్రం అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.