Renu Desai: ‘నా పిల్లలే నాకు తిరిగి జీవితాన్నిఇచ్చారు’.. అకీరా, ఆద్యలను చూసి మురిసిపోతోన్న రేణూ దేశాయ్‌

సినిమాలు చేయకున్నా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటుంది రేణూ దేశాయ్. తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను అందులో షేర్‌ చేసుకుంటుంది. ముఖ్యంగా తన పిల్లలు అకీరా నందన్‌, ఆద్యల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. అలా తాజాగా తన పిల్లల గురించి ఇన్‌స్టాలో ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది రేణూ దేశాయ్‌.

Renu Desai: 'నా పిల్లలే నాకు తిరిగి జీవితాన్నిఇచ్చారు'.. అకీరా, ఆద్యలను చూసి మురిసిపోతోన్న రేణూ దేశాయ్‌
Renu Desai Family
Follow us
Basha Shek

|

Updated on: Jan 18, 2024 | 9:03 AM

సుమారు రెండు దశాబ్దాల తర్వాత టైగర్‌ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ దేశాయ్‌. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్ర ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత రేణూ దేశాయ్‌ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు చాలామంది. అయితే అదేమీ జరగలేదు. ఇప్పటివరకు తన నెక్ట్స్‌ ప్రాజెక్టుపై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అయితే సినిమాలు చేయకున్నా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటుంది రేణూ దేశాయ్. తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను అందులో షేర్‌ చేసుకుంటుంది. ముఖ్యంగా తన పిల్లలు అకీరా నందన్‌, ఆద్యల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. అలా తాజాగా తన పిల్లల గురించి ఇన్‌స్టాలో ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది రేణూ దేశాయ్‌. ప్రస్తుతం కేరళ వెకేషన్‌లో ఉన్న ఆమె అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. మరో వైపు అకీరా, ఆద్యలు మెగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో పియానో వాయించి అందరినీ మెస్మరైజ్ చేశాడు అకీరా నందన్. త్వరలోనూ అతను హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆద్య కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈనేపథ్యంలో తన పిల్లలు ఎదుగుతున్న తీరును చూసి మురిసిపోతోంది రేణూ దేశాయ్‌. ‘వాళ్లకు నేను జీవితాన్ని ఇచ్చానా? లేదంటే వాళ్లు నాకు పుట్టడం వల్ల నాకు తిరిగి పునర్జన్మనిచ్చారా? అన్నది అర్థం కావడం లేదు. నా పిల్లలను చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతుంటాను’ అని పోస్ట్‌లో చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘పిల్లలను చాలా బాగా పెంచుతున్నారు మేడమ్‌.. మీరు నిజంగా చాలా గ్రేట్ ‘ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రేణూ దేశాయ్ త్వరలోనే ఒక వెబ్ సిరీస్ తో మన ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

అకీరా నందన్, ఆద్యల లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మెగా సంక్రాంతి సంబరాల్లో అకీరా, ఆద్య..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?