Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram Collections: ‘గుంటూరు కారం’ ఆరు రోజుల కలెక్షన్స్.. రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న మహేష్..

అమ్మ సెంటిమెంట్ తోపాటు.. మాస్ కమర్షియల్ డ్రామాగా రూపొందించారు త్రివిక్రమ్. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్.. శ్రీలీల, మహేష్ డాన్స్ మరింత హైలెట్ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమాలోని పాటలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. రీజనల్ సినిమాగా విడుదలై.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Guntur Kaaram Collections: 'గుంటూరు కారం' ఆరు రోజుల కలెక్షన్స్.. రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న మహేష్..
Gunturu Kaaram
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2024 | 9:14 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటేస్ట్ మూవీ గుంటూరు కారం.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అమ్మ సెంటిమెంట్ తోపాటు.. మాస్ కమర్షియల్ డ్రామాగా రూపొందించారు త్రివిక్రమ్. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్.. శ్రీలీల, మహేష్ డాన్స్ మరింత హైలెట్ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమాలోని పాటలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. రీజనల్ సినిమాగా విడుదలై.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. జనవరి 17న ఈ సినిమా భారతదేశంలో రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ వారాంతంలో ఈ చిత్రానికి మరిన్ని కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

జనవరి 17న ఈ సినిమా ఇండియాలో రూ.7 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ అటు రూ.100 కోట్ల క్లబ్ లో మాత్రం చేరిపోయింది. రూ.200 కోట్ల గ్రాస్ అందుకుని.. రూ.100 కోట్ల షేర్ రాబట్టిన సినిమాలు మహేష్ ఖాతాలో ఐదు ఉన్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన భరత్ అనే నేను సినిమా దాదాపు రూ.225 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే దాదాపు రూ.110 కోట్లు షేర్ వచ్చినట్లు. ఆ తర్వాత మహర్షి, సరిలేరు నీకెవ్వరూ చిత్రాలు కూడా రూ. 100 కోట్ల షేర్ అందుకున్నాయి. ఇక చివరగా.. సర్కారు వారి పాట సినిమా సైతం రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమా కూడా ఆ జాబితాలోకి చేరుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. జనవరి 17న ఈ సినిమా భారతదేశంలో 28.34 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆరు రోజుల్లో రూ.100.95 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక ఈ వీకెండ్ లో గుంటూరు కారం సినిమాకు మరింత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
24 సిక్సర్లతో క్రికెట్ ప్రపంచానికి మెంటలెక్కించిన యంగ్ ప్లేయర్
24 సిక్సర్లతో క్రికెట్ ప్రపంచానికి మెంటలెక్కించిన యంగ్ ప్లేయర్
డీలర్ల వద్దకు చేరుతున్న ఓలా బైక్స్.. త్వరలోనే డెలివరీలు షురూ
డీలర్ల వద్దకు చేరుతున్న ఓలా బైక్స్.. త్వరలోనే డెలివరీలు షురూ
రికార్డు బ్రేక్ చేసిన రియాన్! బ్యాట్‌తో కాదు బాస్.. ఫీల్డింగ్‌తో
రికార్డు బ్రేక్ చేసిన రియాన్! బ్యాట్‌తో కాదు బాస్.. ఫీల్డింగ్‌తో
ఐఫోన్లు అమెరికాలో కాకుండా చైనాలో ఎందుకు తయారవుతాయి?
ఐఫోన్లు అమెరికాలో కాకుండా చైనాలో ఎందుకు తయారవుతాయి?
9 కోట్ల DC పెట్టుబడి కి JFM ప్లాప్ షో!
9 కోట్ల DC పెట్టుబడి కి JFM ప్లాప్ షో!
అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్
అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్
12 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డ్.. బాపట్ల బుడ్డోడి ట్యాలెంట్‌ చూడండి!
12 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డ్.. బాపట్ల బుడ్డోడి ట్యాలెంట్‌ చూడండి!