Pushpa 2 : పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం ఆ స్టార్ హీరోయిన్.. సమంత ప్లేస్‌లో ఆ బ్యూటీ..
గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్ పెంచేసింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్ పెంచేసింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండే స్పెషల్ సాంగ్ గురించి రోజుకో టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ పాట కోసం మరోసారి సమంతను సంప్రదిస్తున్నారని టాక్ నడిచింది. గతంలో ఫస్ట్ పార్ట్ లో ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు సామ్ నటించగా.. అప్పట్లో ఈ సాంగ్ సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు. దీంతో మరోసారి స్పెషల్ సాంగ్ కోసం సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇప్పుడు సామ్ బదులుగా యంగ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకుంటున్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వస్తున్న పేరు శ్రీలీల. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పటివరకు వరుసగా హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పుష్ప 2 కోసం స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల డాన్స్ కు ఎంత క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మతో డాన్స్ అంటే హీరోలకు దడే అంటూ ఇటీవల మహేష్ సైతం కామెంట్స్ చేశారు. ధమాకా సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు గుంటూరు కారం సినిమాలోనూ మరోసారి డాన్స్‌తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అయితే ఇప్పుడు పుష్ప 2లో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.