AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ‘యానిమల్‌’తో క్రేజ్‌.. సాయి పల్లవి ‘రామాయణం’ లో బాబీ డియోల్‌.. ఏకంగా ఆ పాత్ర కోసం..

ప్రముఖ నటుడు బాబీ డియోల్ ' యానిమల్ ' సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు . ఇందులో ఆయన పోషించిన అబ్రార్ హక్ పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సినిమాలో బాబీ డియోల్‌ ఎంట్రీ సీన్‌ కే చాలామంది ఫిదా అయ్యారు.

Sai Pallavi: 'యానిమల్‌'తో క్రేజ్‌.. సాయి పల్లవి 'రామాయణం' లో బాబీ డియోల్‌.. ఏకంగా ఆ పాత్ర కోసం..
Bobby Deol, Sai Pallavi, Ranbir Kapoor
Basha Shek
|

Updated on: Jan 18, 2024 | 10:28 AM

Share

ప్రముఖ నటుడు బాబీ డియోల్ ‘ యానిమల్ ‘ సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు . ఇందులో ఆయన పోషించిన అబ్రార్ హక్ పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సినిమాలో బాబీ డియోల్‌ ఎంట్రీ సీన్‌ కే చాలామంది ఫిదా అయ్యారు. ఇక యానిమల్‌ సినిమా సూపర్ హిట్ కావడంతో బాబీ డియోల్‌కు మళ్లీ డిమాండ్ పెరిగింది. పెద్ద సినిమాల నుంచి ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు సాయి పల్లవి సీతగా నితీష్ తివారీ రూపొందించే రామాయణంలోనూ బాబీ డియోల్‌ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఆయన కుంభ కర్ణుడి పాత్రను పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. రామాయణంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తారని, సీతగా సాయి పల్లవి కనిపించనుందని సమాచారం. ఇక రావణుడి పాత్రలో నటించేందుకు ‘రాకింగ్ స్టార్’ యష్‌కి ఆఫర్ వచ్చినట్లు కూడా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే బాబీడియోల్‌ కు కుంభకర్ణుడి పాత్రపై కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయి .అయితే దీని గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బాబీ డియోల్‌తో చిత్ర బృందం అలాంటి చర్చలు కూడా జరపలేదని నటుడి బంధువులు చెప్పినట్లు సమాచారం. ‘దంగల్‌’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు దర్శకుడు నితీష్‌ తివారీ. ఇప్పుడు రామాయాణం సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కైకేయి పాత్రలో ప్రముఖ నటి లారా దత్తా, హనుమంతుడిగా బాబీ డియోలో సోదరుడు సన్నీ డియోల్ కనిపించనున్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

ఇవి కూడా చదవండి

యానిమల్ సినిమాలో బాబీ డియోల్

&

nbsp;

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..