AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: ‘పెళ్లి కష్టం.. విడాకులు ఇంకా కష్టం’.. షోయబ్‌తో డివోర్స్‌పై సానియా హింట్‌ ఇచ్చేసిందా?

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడిపోయారని, త్వరలో విడాకులు కూడా తీసుకుంటారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వారు వేర్వురుగా జీవిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Sania Mirza: 'పెళ్లి కష్టం.. విడాకులు ఇంకా కష్టం'.. షోయబ్‌తో డివోర్స్‌పై సానియా హింట్‌ ఇచ్చేసిందా?
Sania Mirza,shoaib Malik
Basha Shek
|

Updated on: Jan 18, 2024 | 12:55 PM

Share

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడిపోయారని, త్వరలో విడాకులు కూడా తీసుకుంటారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వారు వేర్వురుగా జీవిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రూమర్లకు బలం చేకురుస్తూ సానియా తన ముద్దుల కుమారుడు ఇజాన్‌తో కలిసి దుబాయ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో షోయబ్‌ ఎక్కువగా పాకిస్తాన్‌లోనే కనిపిస్తున్నాడు. ఆ మధ్యన కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు సానియా, షోయబ్‌ ఇద్దరూ హాజరయ్యారు. అయితే ఎడమొహం, పెడమొహంగానే కనిపించారు. దీంతో వీరిద్దిరూ నిజంగానే విడిపోతున్నారా? అంటూ అనుమానాలు, సందేహాలు తలెత్తాయి. మరోవైపు తమ విడాకుల వార్త‌ల‌పై ఇటు సానియా మీర్జా గానీ, అటు పోయ‌బ్ మాలిక్ గానీ ఇంత‌వ‌ర‌కు స్పందించిన దాఖలాలు లేవు. అయితే వీరిద్దరూ అప్పుడప్పుడు చేసుకుంటున్న పోస్టులతో భార్యాభార్తల మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. తాజాగా సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెళ్లి, విడాకుల గురించి ఒక ఆసక్తికర పోస్టును షేర్‌ చేసింది. దీంతో వీరద్దరి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ సానియా ఏం రాసుకొచ్చిందంటే?

‘పెళ్లి కష్టం.. విడాకులు ఇంకా కష్టమే.. మీరు కఠినంగా ఉంది ఎంచుకోండి. లావు (ఒబెసిటీ)గా ఉండటం కష్టం.. ఫిట్‌గా ఉండటమూ కష్టమే.. మీరు కఠినంగా ఉంది ఎంచుకోండి. అప్పు ఉండటం కష్టం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడమూ కష్టమే.. మీరు కఠినంగా ఉంది ఎంచుకోండి. ఇతరులతో కలిసిమెలిసి మాట్లాడటం కష్టం.. ఏ సమాచారమూ లేకుండా ఉండడమూ కష్టమే.. మీరు కఠినంగా ఉంది ఎంచుకోండి. జీవితం అనేది అంత సులభమేమీ కాదు అది ఎప్పటికీ కష్టమే. కానీ ఎప్పుడూ మన కష్టాన్నే మనం ఎంచుకోవాలి…’ అని ఇన్‌స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది సానియా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తన భర్త షోయబ్‌ మాలిక్‌ను ఉద్దేశించే సానియా ఈ పోస్ట్‌ పెట్టిందా? అతనితో విడాకులపై ఇన్‌ డైరెక్టుగా హింట్‌ ఇచ్చేసిందా? అని నెట్టింట కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సానియా మీర్జా పోస్ట్ ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..