- Telugu News Photo Gallery Cricket photos HBD Vinod Kambli: Interesting Facts Of Sachin Tendulkar's Close Friend Vinod Kambli
HBD Vinod Kambli: ఈ సచిన్ జాన్ జిగిరి దోస్త్.. ఆటలోనే కాదు.. వివాదాల్లోనూ సంచలనమే..
సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ.. స్కూల్ డేస్‌లోనే మంచి స్నేహితులైన వీరిద్దరూ పిన్న వయసులోనే క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. అయితే కాంబ్లీ క్రికెట్ కెరీర్ 9 ఏళ్లు సాగితే, సచిన్ టెండూల్కర్ మాత్రం ఏకంగా 24 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించాడు
Updated on: Jan 18, 2024 | 2:28 PM

సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ.. స్కూల్ డేస్‌లోనే మంచి స్నేహితులైన వీరిద్దరూ పిన్న వయసులోనే క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. అయితే కాంబ్లీ క్రికెట్ కెరీర్ 9 ఏళ్లు సాగితే, సచిన్ టెండూల్కర్ మాత్రం ఏకంగా 24 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించాడు

భారత్ తరఫున ఆడిన మొదటి ఏడు టెస్టుల్లోనే 113.29 సగటుతో 793 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. దీంతో కాంబ్లీకి బాగా క్రేజ్ వచ్చింది. అయితే ఇదే అతని పతనానికి దారి తీసింది.

భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలోనే వ్యసనాల బారినపడ్డాడు వినోద్ కాంబ్లీ. అతిగా మద్యం సేవించడం, నిత్యం గొడవల్లో, వివాదాలలో తలదూర్చుతూ వార్తల్లో నిలిచాడు.

ఈ కారణాలతో కాంబ్లీ క్రికెట్ కెరీర్ క్రమంగా మసక బారింది. ఫామ్ కోల్పోయాడు. జాతీయ జట్టులో ప్లేస్ కూడా పోయింది. దీంతో అప్పుల పాలయ్యాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.

ఇలా క్రమశిక్షణారాహిత్యంతో తన క్రికెట్ కెరీర్‌ను తానే పాడు చేసుకున్నాడు కాంబ్లీ. ఆ మధ్యన తన కుటుంబ ఖర్చుల కోసం ఏదైనా పని ఇప్పించాలంటూ అందరినీ దీనంగా వేడుకున్నాడు.