కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాన్ సెంచరీతో టీ-20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.