- Telugu News Photo Gallery Cricket photos IND Vs AFG Team India Captain Rohit Sharma Became The First Batter To Smash 300 Sixes In A Country
Rohit Sharma: 179 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ.. లిస్టులో ఒకే ఒక్కడు.. అదేంటంటే?
IND vs AFG, Rohit Sharma Records: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్‌లో రోహిత్ 300 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టాడు. అలాగే, తన ఖాతాలో ఎన్నో రికార్డులను వేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jan 19, 2024 | 11:32 AM

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చిరస్మరణీయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో ఐదో టీ20 సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్.. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అదే సమయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. దీంతో 179 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడి పేరిట లేని రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 69 బంతుల్లో అజేయంగా 121 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్‌లో రోహిత్ 300 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టాడు.

దీంతో క్రికెట్ చరిత్రలో 300 సిక్సర్ల మార్కును దాటిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. భారత్‌లో 173 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ ఇప్పటివరకు 301 సిక్సర్లు బాదాడు.

ఈ జాబితాలో తన దేశం తరపున 256 సిక్సర్లు కొట్టిన న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ రెండో స్థానంలో ఉండగా, బ్రెండన్ మెకల్లమ్ 230 సిక్సర్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

అంతేకాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. టీ20ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు 90 సిక్సర్లు బాదాడు.

దీంతో టీ20లో కెప్టెన్‌గా 86 సిక్సర్లు బాదిన ఇయాన్ మోర్గాన్‌ను రోహిత్ అధిగమించాడు. కెప్టెన్‌గా 82 సిక్సర్లతో ఆరోన్ ఫించ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 59 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో కెప్టెన్‌గా భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 1648 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 50 టీ20 మ్యాచ్‌ల్లో 47.57 సగటుతో 1,570 పరుగులతో భారత్‌కు నాయకత్వం వహించాడు.




