- Telugu News Photo Gallery Cricket photos 10 Players Are Already Final For ICC T20I World Cup 2024 India Squad Says Captain Rohit Sharma
T20I World Cup 2024: టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఆ 10 మంది ఫిక్స్.. 5 స్థానాలే ఖాళీ: రోహిత్ శర్మ
India Squad for ICC T20I World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 యూఎస్‌ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఒక ట్రోఫీ కోసం మొత్తం 20 జట్లు పోటీపడతాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ముగిసిన తర్వాత, రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో భారత్ స్వ్కాడ్‌లో దాదాపు 10 మంది స్థానాలు ఫిక్స్ అయ్యాయని తెలిపాడు.
Updated on: Jan 19, 2024 | 1:42 PM

టీమ్ ఇండియా, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ రెండో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ ఇద్దరూ ఐదో వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ 121 నాటౌట్, రింకూ 69 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత్‌కు ఇదే చివరి టీ20 మ్యాచ్ అని తెలిసిందే.

14 నెలల తర్వాత, ప్రపంచకప్‌నకు ముందు రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం జట్టుకు శుభవార్త అందింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత, రోహిత్ శర్మ మాజీ సహచరులు జహీర్ ఖాన్, ప్రజ్ఞాన్ ఓజా ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడాడు.

ICC T20 వరల్డ్ కప్ 2024 యూఎస్‌ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఒక ట్రోఫీ కోసం మొత్తం 20 జట్లు పోటీపడతాయి. ఈ పోటీలు జూన్ 1 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. 20 జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు.

టీం ఇండియా గ్రూప్-ఎలో ఉంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌లకు కూడా ఒక జట్టు ఉంది. అఫ్గానిస్థాన్‌తో సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం...

‘‘రాబోయే టీ20 ప్రపంచకప్‌నకు టీం ఇండియా బలమైన పోటీదారుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ గెలవడానికి ప్రయత్నిస్తాం. కానీ, మాట్లాడటంతో పని పూర్తి కాదు. అందుకు పూర్తి సిద్ధంగా ఉండాలి. కొంత ప్రిపరేషన్ కూడా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌నకు 15 మంది ఆటగాళ్ల పేర్లను ఇంకా ఖరారు చేయలేదు. అయితే, నా దృష్టిలో 8 నుంచి 10 మంది పేర్లు ఉన్నాయి. వారు జట్టులో తప్పక ఉండగలరు అంటూ రోహిత్ తెలిపాడు. అయితే, వారు ఎవరో మాత్రం పేర్లు వెల్లడించలేదు. ఇలా 15 మంది ఆటగాళ్లలో 8-10 మంది ఆటగాళ్లను టీ20 ప్రపంచకప్ లిస్టులో ఖరారు చేశారు. ఇందులో 5 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ ఐదుగరు గురించి IPL ప్రదర్శన తర్వాత నిర్ణయం తీసుకోనున్నాం అంటూ ప్రకటించాడు.




