WTC 2023-25: విండీస్‌పై 10 వికెట్ల విజయం.. భారత్‌కు గట్టి దెబ్బేసిన ఆస్ట్రేలియా.. లేటెస్ట్ ర్యాంకింగ్స్
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పంజా విసిరింది. ఏకంగా 10 వికెట్లతో కరేబియన్ జట్టును ఓడించి. తద్వారా సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పంజా విసిరింది. ఏకంగా 10 వికెట్లతో కరేబియన్ జట్టును ఓడించి. తద్వారా సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సిరీస్ ఆరంభానికి ముందు పాయింట్ల పట్టికలో నంబర్-1గా ఉన్న ఆస్ట్రేలియా ఈ విజయంతో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇది కాకుండా ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉంటే.. ఈ ఓటమితో వెస్టిండీస్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌లలో 6 విజయాలతో 61.11 విజయాల శాతాన్ని కలిగి ఉంది. అదే సమయంలో భారత్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 54.16 శాతంతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు వెస్టిండీస్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో 2 ఓటములు, 1 డ్రా తో 8వ స్థానంలో ఉంది. విండీస్ ఓటమితో ఇంగ్లాండ్ జట్టు భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు పాయింట్ల పట్టికలో 7 వ స్థానానికి చేరుకుంది.
ఈ పట్టికలో శ్రీలంక జట్టు చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు.ఈ మూడవ ఎడిషన్‌లో, ఆ జట్టు ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ ఓడిపోయింది. డబ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో ఇతర జట్ల స్థానాన్ని పరిశీలిస్తే, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడింది . ఒక దాంట్లో ఓడిపోయి మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. 50 శాతం మార్కులతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది. పాక్ జట్టు 36.66 శాతం పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పుడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ దృష్ట్యా, ఈ టెస్ట్ సిరీస్ ఇరు జట్లకు చాలా ముఖ్యమైనది. ఈ టెస్టు సిరీస్ గెలవడం ద్వారా టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకుతుంది.
A Travis Head century followed by a late flurry of wickets makes for a pretty good day of cricket! See you tomorrow Adelaide!
Day three tickets 🎟️: https://t.co/8TPVarGRgl pic.twitter.com/siwoP0V3Wh
— Cricket Australia (@CricketAus) January 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..