15కే 4 వికెట్లు, ధోని శిష్యుడా.. మజాకా.! బంతితో రఫ్ఫాడించిన చెన్నై ప్లేయర్.. ఎవరంటే.?

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20, తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేష్ తీక్షణా అదరగొట్టాడు. షార్జా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తీక్షణా.. గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ..

15కే 4 వికెట్లు, ధోని శిష్యుడా.. మజాకా.! బంతితో రఫ్ఫాడించిన చెన్నై ప్లేయర్.. ఎవరంటే.?
Maheesh Theekshana
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 20, 2024 | 12:00 PM

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20, తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేష్ తీక్షణా అదరగొట్టాడు. షార్జా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తీక్షణా.. గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. ఈ టోర్నీలోని తొలి మ్యాచ్ శుక్రవారం షార్జాలో గల్ఫ్ జెయింట్స్, షార్జా వారియర్స్ మధ్య జరిగింది.

ఇందులో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న షార్జా వారియర్స్.. ప్రత్యర్ధి గల్ఫ్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టు ఓపెనర్లు స్మిత్(42), విన్స్(45) మొదటి వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. ఆ తర్వాత వచ్చిన జోర్డాన్ కోక్స్(32), ఉస్మాన్ ఖాన్(32) మెరుపులు మెరిపించడంతో.. గల్ఫ్ స్కోర్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. షార్జా బౌలర్లలో తీక్షణా 4 వికెట్లు, వోక్స్ 2 వికెట్లు, సామ్స్ ఒక్క వికెట్ పడగొట్టారు.

ఇక 199 పరుగుల భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన షార్జా వారియర్స్.. ఆరంభం నుంచి దూకుడైన ఆటతీరును ప్రదర్శించింది. ఆ జట్టు ఓపెనర్లు గప్తిల్(40), చార్లెస్(57) ఒక్కసారి పెవిలియన్ చేరేసరికి.. ఆ తర్వాత షార్జా టీం పేకముక్కల్లా కూలిపోయింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో.. చివరికి 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది షార్జా వారియర్స్. దీంతో గల్ఫ్ జెయింట్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.