T20 World Cup 2024: పంత్, షమీ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. త్వరగా కోలుకునేందుకు ఏం చేస్తోందంటే?
భారత క్రికెట్ జట్టులోని అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ముఖ్యంగా మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ గాయాలతో సమమతమవుతున్నారు. వీరిని వీలైనంత త్వరగా కోలుకునేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అన్ని ప్రయత్నాలు చేస్తోంది
భారత క్రికెట్ జట్టులోని అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ముఖ్యంగా మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ గాయాలతో సమమతమవుతున్నారు. వీరిని వీలైనంత త్వరగా కోలుకునేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తదుపరి చికిత్స కోసం ఇప్పటికే సూర్యను విదేశాలకు పంపిన బీసీసీఐ ఇప్పుడు మహ్మద్ షమీ, రిషబ్ పంత్‌లను కూడా విదేశాలకు పంపాలని నిర్ణయించింది. దీని ద్వారా అతనికి వీలైనంత త్వరగా వైద్యం చేసి జట్టులోకి తీసుకురావాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించిన షమీ పాదానికి గాయమైంది. ప్రపంచకప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దక్షిణాఫ్రికా టూర్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం షమీ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చికిత్స పొందుతున్నాడు. అయితే స్పెషలిస్ట్‌ను సంప్రదించేందుకు షమీ లండన్ వెళ్లనున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. నివేదికల ప్రకారం, NCA స్పోర్ట్స్ సైన్స్ హెడ్ నితిన్ పటేల్ కూడా షమీతో పాటు లండన్ వెళ్లనున్నారు. షమీ గాయాన్ని పటేల్ నిశితంగా పరిశీలించి, లండన్‌లోని స్పెషలిస్ట్‌కు చూపించడం మంచిదని నిర్ణయించుకున్నాడు. షమీ, పటేల్‌లు ఎప్పుడు లండన్ వెళతారో ఇంకా ఖరారు కాలేదు. అయితే గాయం కారణంగా షమీ లండన్ వెళ్లడం ఖాయం.
షమీతో పాటు త్వరలో పంత్‌ను కూడా లండన్‌కు పంపే అవకాశం ఉంది. 30 డిసెంబర్ 2022న, పంత్ ఢిల్లీ నుండి రూర్కీలోని తన ఇంటికి వెళుతుండగా కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో పునరాగమనం కోసం పంత్ కోలుకోవడంపై బీసీసీఐ ప్రత్యేక సంప్రదింపులు జరుపుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రిషబ్ పంత్ ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్నాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే. అంటే పంత్ ఒక బ్యాటర్‌గా మాత్రమే కనిపించే అవకాశం ఉంది, ముఖ్యంగా ఫినిషర్‌గా. ‘పంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. అతను వచ్చే సీజన్‌లో ఐపీఎల్‌లో ఆడనున్నాడు’ అని సౌరవ్ గంగూలీ డిసెంబర్‌లో చెప్పాడు. రిషబ్ ప్రాక్టీస్‌కి దిగేందుకు ఇంకా సమయం ఉంది. జనవరి చివరి నాటికి అతను కోలుకుంటానని గంగూలీ చెప్పాడు.
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗦𝗲𝗿𝗶𝗲𝘀
After a fantastic 3⃣-0⃣ win over Afghanistan, it’s time to find out who won the much-awaited Fielder of the Series Medal 🏅😎
Check it out 🎥🔽 #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/N30kVdndzB
— BCCI (@BCCI) January 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..