Indian Police Force OTT: ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో  యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

టాప్‌ హీరోలు, హీరోయిన్లతో కలిసి ఒక స్టార్‌ డైరెక్టర్‌ తెరకెక్కించిన ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. అదే ఇండియన్ పోలీస్‌ ఫోర్స్‌. బాలీవుడ్‌లో యాక్షన్‌ సినిమాలు, అందులోనూ పోలీస్‌ స్టోరీలు

Indian Police Force OTT: ఓటీటీలో టాప్  ట్రెండింగ్‌లో  యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
Indian Police Force Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jan 20, 2024 | 2:04 PM

ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లకు బాగా ఆదరణ వస్తోంది. ముఖ్యంగా సస్పెన్స్‌, థ్రిల్లర్‌, యాక్షన్‌ సిరీస్‌ లు సూపర్బ్‌ రెస్పాన్స్‌ దక్కించుకుంటున్నాయి. అందుకే స్టార్‌ హీరోలు, డైరెక్టర్లు సైతం వెబ్‌ సిరీస్‌ లపై ఆసక్తి చూపిస్తున్నారు .అలా టాప్‌ హీరోలు, హీరోయిన్లతో కలిసి ఒక స్టార్‌ డైరెక్టర్‌ తెరకెక్కించిన ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. అదే ఇండియన్ పోలీస్‌ ఫోర్స్‌. బాలీవుడ్‌లో యాక్షన్‌ సినిమాలు, అందులోనూ పోలీస్‌ స్టోరీలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన రోహిత్ శెట్టి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో సిద్ధార్థ మల్హోత్రా, సీనియర్‌ నటి శిల్పాశెట్టి, వివేక్‌ ఓబెరాయ్‌, శ్వేతా తివారి, ముకేష్‌ రిషి, నికితిన్‌ ధీర్‌, రితురాజ్‌ సింగ్‌, లలిత్‌ పరిమో, శరద్ ఖేల్కర్‌.. ఇలా స్టార్‌ నటీనటులందరూ ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ వెబ్‌ సిరీస్‌లో నటించడం విశేషం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సూపర్‌ యాక్షన్ సిరీస్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో శుక్రవారం (జనవరి 19) నుంచే ఇండియన్ పోలీస్‌ ఫోర్స్‌ స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇండియన్ పోలీస్‌ ఫోర్స్‌ రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఎపిసోడ్స్‌ ఉన్నాయి. రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ , రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు. గతంలో రోహిత్ సినిమాల్లో హీరోలుగా నటించిన అజయ్‌ దేవ్‌గణ్‌ (సింగం), అక్షయ్‌ కుమార్‌ (సూర్యవంశీ), రణ్‌వీర్‌ సింగ్‌ (సింబా) ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ వెబ్ సిరీస్‌ లో స్పెషల్‌ రోల్స్‌లో సందడి చేశారు. మరి మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలు, సిరీస్‌ లు చూడాలనుకునేవారికి ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఒక మంచి చాయిస్‌.

అమెజాన్ లో స్ట్రీమింగ్..

టాప్ ట్రెండింగ్ లో

ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌ వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.