SSE SideB OTT: ఓటీటీలోకి సప్త సాగరాలు దాటి సైడ్ బి.. రక్షిత్ శెట్టి లవ్ స్టోరీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం 'సప్త సాగరాలు దాటి'. మొత్తం రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ కథానాయిక. హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహించార. ఇప్పటికే సప్త సాగరాలు దాటి- సైడ్ ఏ థియేటర్లలోనూ, ఓటీటీలోనూ రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి’. మొత్తం రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ కథానాయిక. హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహించార. ఇప్పటికే సప్త సాగరాలు దాటి- సైడ్ ఏ థియేటర్లలోనూ, ఓటీటీలోనూ రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన సప్త సాగరాలు దాటి సైడ్- బి సైతం గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. దీనికి కూడా మంచి ఆదరణ దక్కింది. ప్రేమకథకు తోడు కాస్త రివేంజ్ ఎలిమెంట్స్ జోడించి మరింత ఆసక్తికరంగా రెండో పార్టును రూపొందించారు మేకర్స్. థియేటర్లలో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న సప్త సాగరాలు దాటి సైడ్- బి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఎస్‌ఎస్‌ఈ సైడ్ బి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే సప్త సాగరాలు దాటి- బి ని స్ట్రీమింగ్ చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. తాజాగా ఇదే విషయంపై ట్వీట్ చేశాడు హీరో రక్షిత్ శెట్టి. ‘మా సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలన్న దానిపై అమెజాన్ ప్రైమ్ సంస్థతో చర్చలు జరుపుతున్నాం. డేట్ ఖరారు చేసి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తాం’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు రక్షిత్. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియను కలిశాడా? వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడా?
ఇక సప్త సాగరాలు దాటి సైడ్- బి కథ విషయానికి వస్తే.. అనుకోని నేరాన్ని తన మీద వేసుకుని పదేళ్ల శిక్ష తర్వాత మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి విడుదలవుతాడు. తన ప్రియురాలు ప్రియ (రుక్మిణీ వసంత్) అడ్రస్ కోసం వెతకడం మొదలు పెడతాడు. అందుకోసం సురభి (చైత్ర జే. ఆచార్) హెల్ప్ తీసుకుంటాడు. మరి మను, ప్రియలు కలిశారా? ఇంతకీ సురభి ఎవరు? తను జైలులో మగ్గిపోవడానిఇక కారణమైన వాళ్లపై మను ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్న అంశాలతో ఎస్‌ఎస్‌ఈ సైడ్ బి సాగుతుంది. మంచి ఫీల్ గుడ్ సినిమాను చూడాలనుకునేవారికి సప్త సాగరాలు దాటి సైడ్ బి ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
రక్షిత్ శెట్టి ట్వీట్ ..
#SSESideB is coming on Amazon soon. We will announce the date as it gets confirmed 🤗
— Rakshit Shetty (@rakshitshetty) January 20, 2024
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
with some people it just fits💙 pic.twitter.com/iNQ8ftfymW
— prime video IN (@PrimeVideoIN) January 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.