Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘బిగ్‌బాస్‌’లో ఛాన్స్‌ అంటూ ఛీటింగ్.. లక్షలు ఇచ్చి మోసపోయిన యాంకర్‌.. పోలీసులకు ఫిర్యాదు

'బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసాడు' అంటూ అని యాంకర్‌, నటి స్వప్నా చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు ఎప్పటి నుంచో బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనాలని ఆశగా ఉందట.

Bigg Boss 7 Telugu: 'బిగ్‌బాస్‌'లో ఛాన్స్‌ అంటూ ఛీటింగ్.. లక్షలు ఇచ్చి మోసపోయిన యాంకర్‌.. పోలీసులకు ఫిర్యాదు
Anchor Swapna Chowdary
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2024 | 8:21 AM

‘బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసాడు’ అంటూ అని యాంకర్‌, నటి స్వప్నా చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు ఎప్పటి నుంచో బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనాలని ఆశగా ఉందట. దీనినే అవకాశంగా తీసుకున్న సత్య తాను మాటీవీ ప్రొడక్షన్ ఇన్చార్జినని స్వప్నతో పరిచయం పెంచుకున్నాడు. ఆరు నెలల క్రితం బిగ్ బాస్ ఇంచార్జ్ అంటూ తమిళ రాజును స్వప్నకు సత్య పరిచయం చేశాడు. బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌లో తప్పకుండా అవకాశం కల్పిస్తానని స్వప్న దగ్గర 2.5 లక్షలు తీసుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులను ఆశ్రయించింది స్వప్న. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో మిస్టరీ, నమస్తే సేట్‌ జీ అనే చిన్న సినిమాల్లోనూ నటించింది స్వప్నా చౌదరి. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలతో ఆమెకు మంచి సంబంధాలున్నాయి.

తెలుగులో బిగ్‌ బాస్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచే ఈ సెలబ్రిటీ గేమ్‌ షోపై ఆసక్తి పెంచుకుంది స్వప్న. ఎలాగైనా ఈ గేమ్ షోకి వెళ్లాలనుని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అదనుగా తీసుకుని సత్య ఆమెను మోసం చేశాడు. దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితమే వీడియోను రిలీజ్‌ చేసిందామె. అందులో తమిళ రాజు చేతిలో తాను ఎలా మోసపోయిందో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పుడిదే విషయమై పోలీసులను ఆశ్రయించింది స్వప్న.

ఇవి కూడా చదవండి

ప్రముఖ నటుడు అలీతో స్వప్నా చౌదరి..

బిగ్ బాస్ విన్నర్ సన్నీతో ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని
విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని