Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: అయోధ్య రామయ్య ఆహ్వానం అందింది.. ఆ కారణంతో వెళ్లలేకపోతున్నా: మోహన్‌ బాబు

రామ భక్తుల 500 ఏళ్ల నాటి కల సాకారమవుతోంది. మరికొన్ని గంటల్లో అయోధ్యలో బాల రాముడు కొలువు దీరనున్నాడు. సోమవారం (జనవరి 22)న జరిగే అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మహాక్రతువును వీక్షించేందుకు

Mohan Babu: అయోధ్య రామయ్య ఆహ్వానం అందింది.. ఆ కారణంతో వెళ్లలేకపోతున్నా: మోహన్‌ బాబు
Mohan Babu
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2024 | 10:12 AM

రామ భక్తుల 500 ఏళ్ల నాటి కల సాకారమవుతోంది. మరికొన్ని గంటల్లో అయోధ్యలో బాల రాముడు కొలువు దీరనున్నాడు. సోమవారం (జనవరి 22)న జరిగే అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మహాక్రతువును వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తరలి రానున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. వారిలో ప్రముఖ నటుడు మోహన్‌ బాబు కూడా ఉన్నారు. అయితే తాను అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లట్లేదన్నారు కలెక్షన్‌ కింగ్‌. అందుకు గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మోహన్ బాబు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘మనది రాముడు పుట్టిన దేశం.. ఇది రామ జన్మ భూమి అని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఊరూరా తరలి వెళ్తున్నారు. నాకు కూడా అహ్వానం అందింది. భద్రత కూడా కల్పిస్తామన్నారు. అయితే భద్రతా పరమైన సమస్యలకు తోడు కొన్ని వ్యక్తిగత కారణాలతో అయోధ్యకు వెళ్లట్లేదు’ అని చెప్పుకొచ్చారు మోహన్‌ బాబు.

ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖుల తరలి వెళ్లనున్నారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ దంపతులు, ప్రభాస్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, రిషబ్ శెట్టి, యష్, కంగనా రనౌత్, అలియా భట్‌, రజనీకాంత్, యష్, అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, రణదీప్ హుడా, అనుష్క శర్మ, అనుపమ్ ఖేర్, అజయ్‌ దేవగన్, మాధురీ దీక్షిత్, సంజయ్ లీలా బన్సాలీ, సన్నీడియోల్ తదితర ప్రముఖులు అయోధ్యకు వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.