Salaar 2: ‘సలార్ 2’లో అఖిల్ అక్కినేని స్పెషల్ రోల్ ?.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్ సతీమణి..

మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ఇటీవల విడుదలైన సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సెకండ్ పార్ట్ సలార్ శౌర్యాంగపర్వం కోసం ఇప్పుడు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Salaar 2: 'సలార్ 2'లో అఖిల్ అక్కినేని స్పెషల్ రోల్ ?.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్ సతీమణి..
Akhil, Salaar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 21, 2024 | 7:40 AM

బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో చేరిన మరో బ్లాక్ బస్టర్ హిట్ ‘సలార్’. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈమూవీ వరల్డ్ వైడ్ భారీ విజయాన్ని అందుకుంది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ఇటీవల విడుదలైన సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సెకండ్ పార్ట్ సలార్ శౌర్యాంగపర్వం కోసం ఇప్పుడు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.

ఈ వేడుకలకు ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు.. చిత్రయూనిట్ సభ్యులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు హాజరయ్యారు. అయితే ఇదే వేడుకలలో అక్కినేని అఖిల్ సైతం పాల్గొన్నారు. దీంతో ఈ చిత్రంలో అఖిల్ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జోరందుకంది. ఇందులో అఖిల్ దేవా తమ్ముడిగా నటించనున్నాడని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా సలార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను రివీల్ చేసింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సతీమణి లికితా రెడ్డి. ఈ సందర్భంగా సలార్ పార్ట్ 2 గురించి ఇన్ స్టా వేదికగా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

Salaar

Salaar

1. దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు ?..

లిఖితా..శౌర్యంగ పర్వంలో ధార పాత్రను చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాను.

2. తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా ?..

లిఖితా.. మిలియన్ డాలర్ల ప్రశ్న.

3. సలార్ 3పై ప్లాన్స్ ఉన్నాయా ?..

లిఖితా.. శౌర్యంగపర్వం క్లైమాక్స్ లో దానికి సమాధానం దొరుకుతుంది.

4. దేవా చిన్నతనాన్ని చూపించినప్పుడు..వాళ్లమ్మ గర్భిణిగా ఉన్నట్లు చూపించారు. కాబట్టి దేవాకు తమ్ముడు ఉండొచ్చు..

లిఖితా.. నేను దీనిని గుర్తించలేదు.

5. దేవాకు డైలాగ్స్ ఎందుకు ఎక్కువగా లేవు ?..

లిఖితా.. అతని నీడే మిలియన్ డైలాగ్స్ సమానం కాబట్టి.

6. అక్కినేని అఖిల్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని రూమర్ నడుస్తుంది ?..

లిఖితా.. అందులో ఎలాంటి నిజం లేదు.

View this post on Instagram

A post shared by Likitha (@likithareddyneel)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.