AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director : ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్.. 24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..

భారతీయ సినిమా రంగంలో ఇప్పటివరకు అపజయమెరుగని దర్శకులు ఉన్నారు. వారందరూ తెరకెక్కించిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ డైరెక్టర్ మాత్రం దాదాపు 24 ఏళ్లుగా ఒక్క హిట్టు అందుకోలేదు. అయినప్పటికీ 4 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 11 సినిమాల్లో 4 అట్టర్ ప్లాప్ అయ్యాయి.

Director : ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్.. 24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
Vishal Bharadwaj
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2026 | 10:56 AM

Share

ప్రస్తుతం తెలుగు సినీరంగంలో టాప్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తొచ్చే దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు అపజయమెరుగని దర్శకుడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వరుసగా హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ దర్శకుడు దాదాపు 24 ఏళ్లుగా ఒక్క హిట్టు అందుకోలేదు. అయినప్పటికీ ఆయన తెరకెక్కించిన సినిమాలు వరుసగా జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అందంలో రాజహంస.. 47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్.. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం..

విశాల్ భరద్వాజ్.. కథ, పాత్ర, సంగీతం మాత్రే సినిమాకు నిజమైన బలం అని భావిస్తారు. ప్రతి సినిమా సమాజం, మానవ సంబంధాలను విభిన్న శైలిలో చూపిస్తుంటారు. భిన్నమైన ఆలోచనలు.. అంశాలు, అర్థవంతమైన ప్రదర్శన చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా మంది నటీనటులు విశాల్ భరద్వాజ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నారు. విశాల్ భరద్వాజ్ 2002లో విడుదలైన ‘మక్ది’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘మక్బూల్’, ‘ఓంకార’, ‘కామినే’, ‘ఇష్కియా’, ‘7 ఖూన్ మాఫ్’, ‘ఏక్ థి దాయన్’, ‘హైదర్’, ‘తల్వార్’, ‘రంగూన్’ , ‘పటాకా’ వంటి అనేక విభిన్న రకాల చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..

విశాల్ భరద్వాజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆ సినిమాల్లోని పాత్రలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాయి. తన 31 ఏళ్ల కెరీర్‌లో, విశాల్ భరద్వాజ్ మొత్తం 11 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో 4 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలు చవిచూశాయి. అతని చిత్రాలను జాతీయ అవార్డులతో సత్కరించింది. అతని నాలుగు చిత్రాలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..

ఆయన తొలి చిత్రం ‘మక్ది’ బాలనటి శ్వేతా బసు ప్రసాద్ కు జాతీయ అవార్డును అందించింది. అలాగే, 2005లో విడుదలైన ‘ది బ్లూ అంబ్రెల్లా’ చిత్రం కూడా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ. 2006లో వచ్చిన ‘ఓంకార’ ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. 2014లో ‘హైదర్’ చిత్రానికి విశాల్ భరద్వాజ్ ఉత్తమ స్క్రీన్ ప్లే, సంభాషణ రచనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. దీనితో పాటు, 2015లో ఆయన ‘తల్వార్’ చిత్రానికి రాసిన స్క్రీన్ ప్లే కూడా జాతీయ అవార్డు గెలుచుకుంది.

Vishal Bharadwaj Movie

Vishal Bharadwaj Movie

ఎక్కువ మంది చదివినవి : Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Follow Us