AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Revised Guidelines: యూపీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్‌.. సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్‌ మారాయ్‌!

ఎంతో కఠినమైన అఖిల భారత సర్వీసుల ఎంపిక ప్రక్రియలో పారదర్శత కోసం యూపీఎస్సీ నూతన సంస్కరణలు తీసుకువచ్చింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 అధికారిక నోటిఫికేషన్‌లో ఈ మార్పులు ప్రకటించింది..

UPSC Revised Guidelines: యూపీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్‌.. సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్‌ మారాయ్‌!
UPSC Civil Services revised guidelines
Srilakshmi C
|

Updated on: Feb 08, 2026 | 11:25 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8:  ఈ ఏడాదికి యూపీఎస్సీ మొత్తం 933 పోస్టులను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఇందులో 33 పోస్టులు బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్నవారికి రిజర్వు చేశారు. మే 24వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ ద్వారానే అభ్యర్ధులను అనుమతిస్తారు.

దరఖాస్తుదారులు ఆధార్ కార్డులను గుర్తింపు, కార్డులుగా వినియోగించాలని, దీనివల్ల వెరిఫికేషన్ సులభంగా జరుగుతుందని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులను ఎంపిక చేయడానికి UPSC ప్రతి యేట ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ ఏడాది నుంచి పారదర్శకత కోసం అభ్యర్థులు పరీక్షా వేదిక వద్ద తప్పనిసరిగా ముఖ ధృవీకరణ చేయించుకోవాలి. ముఖ ధృవీకరణ/గుర్తింపు ధృవీకరణ తనిఖీ కోసం అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని UPSC నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రామాణీకరణ కోసం అభ్యర్ధులు తమ ఆధార్ కార్డును ID పత్రాలుగా ఉపయోగించాలని యూపీఎస్సీ సూచించింది. అలాగే ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ సర్వీసుల్లో ఉన్నవారు 2026 పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు కాదని కమిషన్‌ తేల్చి చెప్పింది.

ప్రిలిమినరీ పరీక్ష తర్వాత IAS లేదా IFS కు నియమితులైతే వారు ప్రిలిమ్స్ లో అర్హత సాధించినప్పటికీ మెయిన్స్‌ దశలో హాజరు కావడానికి అర్హులు కారు. మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమైన తర్వాత కానీ, ఫలితాలు ప్రకటించే ముందుగానీ, ఎంపికైతే వారు CSE 2026 ఫలితాల ప్రకారం ఏ సర్వీస్/పోస్ట్ కు పరిగణించబడరు. ప్పటికే ఎంపికైన లేదా IPSకి నియమించబడిన అభ్యర్థులు CSE-2026 పరీక్ష ద్వారా మళ్ళీ అదే సేవను ఎంచుకోవడానికి అర్హులు కారు. CSE 2026లో IPS లేదా సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘A’ కి కేటాయించబడిన అభ్యర్థులు తదుపరి CSE-2027 పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే సంబంధిత అథారిటీ నుంచి ట్రైనింగ్‌లో చేరడంపై ఒకసారి మినహాయింపు పొందితే, వారు వెంటనే తదుపరి సీఎస్‌ఈ-2027 పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీపై అభ్యంతరాల గడువును కూడా యూపీఎస్సీ ఏడు రోజుల నుండి ఐదు రోజులకు తగ్గించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో పరీక్షా జవాబు కీపై 5 రోజుల (ఐదు రోజులు) వ్యవధిలో ప్రాతినిధ్యాలు ఇవ్వడానికి అభ్యర్థులకు కమిషన్ అవకాశం కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

CSE-2026కి దరఖాస్తు చేసుకునే ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులు 2022-2023, 2023-2024 , 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం ఆధారంగా ఏప్రిల్ 1, 2025న/తర్వాత (2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత) జారీ చేసిన OBC (నాన్-క్రీమీ లేయర్) సర్టిఫికేట్‌ను సమర్పించాలి. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అంటే ఫిబ్రవరి 24 కంటే ముందే ఉండాలి. దరఖాస్తుదారులు కామన్ అప్లికేషన్ ఫారమ్ (CAF) నింపేటప్పుడు వారి ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేసి, వారి లైవ్ ఫోటోగ్రాఫ్‌ను కూడా తీసుకోవలి. బ్లాక్‌ పెన్‌తో తెల్ల కాగితంపై మూడుసార్లు (ఒకదాని క్రింద ఒకటి) సంతకం చేసి CAF నింపేటప్పుడు దానిని అప్‌లోడ్ చేయాలని నోటిఫికేషన్‌లో కమిషన్‌ పేర్కొంది. అలాగే ఇకపై అభ్యర్థులు అప్లికేషన్‌ సబ్‌మిట్‌ చేసిన తర్వాత ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. అంతేకాకుండా దరఖాస్తు సవరణకు కూడా అవకాశం ఉండదు. దరఖాస్తుదారులు ఒకేసారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?