AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు జంకుతున్న జనాలు!

వాల్మీడి గ్రామంలో వేలాది కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లు, పంటపొలాలను ధ్వంసం చేస్తూ గ్రామస్తులను భయపెడుతున్నాయి. ఇటీవల రెండు కోతుల గుంపుల మధ్య జరిగిన భీకర పోరాటం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పిల్లలు, పెద్దలు ఒంటరిగా బయటకు రావాలంటే వణికిపోతున్నారు. కిరాణా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కోతుల బెడద నుండి తమను రక్షించాలని గ్రామస్తులు అధికారులును వేడుకుంటున్నారు.

Watch: ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు జంకుతున్న జనాలు!
Valmidi Monkey Menace
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 08, 2026 | 11:42 AM

Share

లవకుశులు నడయాడిన నేల వాల్మీడీలో వానరసేనలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా వేలాది కోతులు ఇక్కడి ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తున్నాయి. స్థానికుల ఇళ్లలోకి చొరబడి గృహోపకరణాలు చిందరవందర చేస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా రెండు కోతుల గుంపుల మధ్య జరిగిన భీకర యుద్ధం ఊరి ప్రజలందరూ ఉలిక్కిపడిలే చేసింది.

వాల్మీకి జన్మించిన గడ్డ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వాల్మీడీ గ్రామాన్ని వానరసేనలు చుట్టుముట్టాయి.. ఎక్కడెక్కడి నుండో వచ్చిన వానరాలు ఊరంతా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. వేలాది కోతులతో ఇక్కడ పరిస్థితులు కిష్కిందకాండలా మారిపోయాయి. తాజాగా గ్రామంలో రెండు కోతుల గుంపుల మధ్య జరిగిన గొడవ.. ఊరి ప్రజలనంతా వనికిపోయేలా చేసింది. గ్రామంలో ఒకేసారి వేలాదిగా కోతులు ఎదురుపడడంతో రెండు గ్రూపుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ దాడిలో రెండు గ్రూపుల కోతులు పరస్పరం రక్కుకొని రక్తాలు వచ్చేలా బీభత్సం సృష్టించాయి.. కోతుల మధ్య ఈ భీకర యుద్దాలన్ని చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో జనాలంతా ఇళ్లలోకి పరుగులు పెట్టారు.

వాల్మీడీ గ్రామంలో వానరాల సంచారంతో జనాలు మొత్తం హడలెత్తిపోతున్నారు. బయటకు వెళ్తే ఏ కోతి దాడి చేస్తుందోననే భయంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పిల్లలు, పెద్దలు ఒంటరిగా రోడ్డు పై వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా కిరాణా దుకాణాలు వ్యాపారులు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వానరాలు కేవలం ఇళ్లపై దాడి చేయడమే కాకుండా గ్రామంలోని పొలాలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఈ కోతుల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..