AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోలీవుడ్‌పై కన్నేసిన తెలుగు డైరెక్టర్.. పాన్ ఇండియా సినిమాతో అరంగేట్రానికి ప్లాన్

సినిమా ఇండస్ట్రీలో ఒక మాట తరచూ వినిపిస్తుంటుంది. ఒక్క విజయం ఒక దర్శకుడిని ఓవర్‌నైట్ స్టార్‌ని చేస్తే, ఒక్క అపజయం తర్వాతి ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ మాట స్టార్‌‌ డైరెక్టర్‌‌ నుంచి కొత్త డైరెక్టర్ వరకు అందరి విషయంలోనూ అక్షరాలా నిజమవుతుంది.

కోలీవుడ్‌పై కన్నేసిన తెలుగు డైరెక్టర్.. పాన్ ఇండియా సినిమాతో అరంగేట్రానికి ప్లాన్
Star Hero N Director
Nikhil
|

Updated on: Feb 08, 2026 | 11:34 AM

Share

గతంలో టాలీవుడ్ అగ్ర హీరోలను డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన ఆ దర్శకుడు.. ఇటీవల ఒక యువ హీరోతో చేసిన సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఆయన తదుపరి సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగులో కాకుండా ఇప్పుడు ఆయన పక్క ఇండస్ట్రీపై కన్నేశారని, అక్కడ ఉన్న ఒక విలక్షణ నటుడిని ఒప్పించి భారీ పాన్ ఇండియా సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ హీరో కాల్షీట్లు దొరికితే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నారట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఆయన మదిలో ఉన్న ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు?

సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన దర్శకుడు పరశురామ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టు కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. గత ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత పరశురామ్ తన కెరీర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కథా చర్చల కోసం ఆయన చాలా కసరత్తులు చేస్తున్నారని సమాచారం.

కోలీవుడ్‌పై దృష్టి..

తాజా సమాచారం ప్రకారం పరశురామ్ ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. తన తదుపరి సినిమాను ఒక తమిళ టాప్ హీరోతో చేసే అవకాశం ఉందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే పరశురామ్ తన తర్వాతి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. సూర్య వంటి వర్సటైల్ హీరోకు సరిపోయే ఒక బలమైన కథను పరశురామ్ ఇప్పటికే సిద్ధం చేశారని, అది సూర్యకు కూడా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఈ సినిమాకు భారీ క్రేజ్ రావడం ఖాయం.

Suryaa N Parasuram

Suryaa N Parasuram

ఈ క్రేజీ ప్రాజెక్టును టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తారని సమాచారం. గతంలో పరశురామ్ తో ‘ఫ్యామిలీ స్టార్’ నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. సూర్య వంటి గ్లోబల్ స్టార్ తో సినిమా అంటే అది కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా పరశురామ్ సినిమాలు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడి ఉంటాయి. అయితే సూర్యతో సినిమా అంటే యాక్షన్, ఎమోషన్ కలగలిపి ఉండాలని ఆయన భావిస్తున్నారట. సూర్య ప్రస్తుతం తన సొంత ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, పరశురామ్ వినిపించిన కథలోని వైవిధ్యం ఆయనను ఆకట్టుకుందని సమాచారం. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కితే పరశురామ్ కెరీర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయం. ‘గీత గోవిందం’ వంటి హిట్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టే సినిమా కోసం పరశురామ్ పట్టుదలగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ చేదు జ్ఞాపకాన్ని మరిపించి సూర్యతో పరశురామ్ సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. దిల్ రాజు – పరశురామ్ – సూర్య కాంబినేషన్ వినడానికే చాలా ఆసక్తిగా ఉందంటున్నారు అభిమానులు.

Follow Us