AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీని క్రాష్ చేసిన సినిమా.. ఒకేసారి కోటి మంది అభిమానులు లాగిన్..

ఓటీటీలో ఇటీవల విడుదలైన ఒక సినిమా కొన్ని సినిమాల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను క్రాష్ చేసింది. నిజానికి ఆ సినిమాను థియేటర్లలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ కోసం ఒకేసారి కోటి మంది అభిమానులు లాగిన్ అయ్యారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీని క్రాష్ చేసిన సినిమా.. ఒకేసారి కోటి మంది అభిమానులు లాగిన్..
Raja Saab (1)
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2026 | 11:48 AM

Share

సాధారణంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంటాయి. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చిన చిత్రాలు సైతం ఓటీటీలో మంచి విజయాన్ని సాధిస్తాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది. ఒకేసారి కోటి మంది ఓటీటీలోకి లాగిన్ కు అవ్వడం వల్ల మొత్తం ప్లాట్ ఫామ్ క్రాష్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? థియేటర్లలో ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అంటూ రివ్యూస్ వస్తున్నాయి. రూ.400 కోట్ల బడ్జెట్ మూవీ.. కేవలం రూ.200 కోట్లు రాబట్టింది. ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో సత్తా చాటుతుంది. అదే రాజా సాబ్.

ఎక్కువ మంది చదివినవి : Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రితి కుమార్, జైనబ్ వహాబ్, సంజయ్ దత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇక ఇప్పుడు ఇదే మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ జియో హాట్ స్టార్ లో విడుదలైంది. రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మంది అభిమానులు ఒకేసారి లాగిన్ కావడంతో జియో ప్లాట్ ఫామ్ డౌన్ అయ్యిందట. అందుకు కారణం దాదాపు కోటి మందికి పైగ అభిమానులు రిమైండ్ మీ అనే బటన్ క్లిక్ చేశారట.

ఎక్కువ మంది చదివినవి : Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..

ఈ ఘటనతో జియో హాట్ స్టార్ తమ సర్వర్ సామర్థ్యాన్ని మెరుగుపరిచిందట. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. రాజా సాబ్ చిత్రంలోని పలు సన్నివేశాలను సైతం జత చేసినట్లు టాక్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అందంలో రాజహంస.. 47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్.. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం..

ఎక్కువ మంది చదివినవి : Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర