AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ooru Peru Bhairavakona: ‘ఊరు పేరు భైరవకోన’ ప్రమోషన్స్.. హీరోయిన్లతో కలిసి రోడ్డు పక్కన భోజనం చేసిన హీరో..

గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన.. భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం.. లిఖించబడిందే జరుగుతుంది.. రక్తపాతం జరగనియ్... అంటూ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. దైవభక్తి.. క్షుద్రశక్తితోపాటు కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే నెల 9న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్.

Ooru Peru Bhairavakona: 'ఊరు పేరు భైరవకోన' ప్రమోషన్స్.. హీరోయిన్లతో కలిసి రోడ్డు పక్కన భోజనం చేసిన హీరో..
Ooru Peru Bhairavakona
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2024 | 9:09 AM

Share

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించింది. గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన.. భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం.. లిఖించబడిందే జరుగుతుంది.. రక్తపాతం జరగనియ్… అంటూ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. దైవభక్తి.. క్షుద్రశక్తితోపాటు కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే నెల 9న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్.

అయితే రోటీన్‏కు భిన్నంగా భైవరకోన యూనిట్ సభ్యులతో కలిసి ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు హీరో సందీప్ కిషన్. హైదరాబాద్‏లోని సాయికుమారి అనే మహిళ కొంతకాలంగా ఫుడ్ బిజినెస్ చేస్తుంది. రోడ్డుపైనే ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసి రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వంటల్ని జనాలకు అందిస్తోంది. కన్నా.. నాన్నా.. చిన్నా అంటూ ప్రేమగా మాట్లాడుతునే భోజనం వడ్డిస్తుంది. ఇటీవల ఆమెకు ఫుడ్ బిజినెస్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఇప్పుడు ఊరు పేరు భైరవకోన టీమ్ అక్కడికి వెళ్లిపోయి ఆమె చేతివంట రుచి చూసింది.

సందీప్ కిషన్, వర్ష బొలమ్మ, కావ్య థాపర్ అక్కడి భోజనాన్ని తిని ఆస్వాదించారు. అనంతరం ఆమెతో కాసేపు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఊరు పేరు భైరవకోన మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!