AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: షోయబ్‌ మాలిక్‌కు శుభాకాంక్షలు తెలిపిన సానియా మీర్జా ఫ్యామిలీ.. విడాకులపై కీలక ప్రకటన

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా కుటుంబం తొలిసారి స్పందించింది. దీంతో పాటు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులను కూడా ఖరారు చేసింది. ఈ మేరకు సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా ఒక ప్రకటన విడుదల చేసింది.

Sania Mirza: షోయబ్‌ మాలిక్‌కు శుభాకాంక్షలు తెలిపిన సానియా మీర్జా ఫ్యామిలీ.. విడాకులపై కీలక ప్రకటన
Sania Mirza, Shoaib Malik
Basha Shek
|

Updated on: Jan 21, 2024 | 1:34 PM

Share

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా కుటుంబం తొలిసారి స్పందించింది. దీంతో పాటు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులను కూడా ఖరారు చేసింది. ఈ మేరకు సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ చాలా కాలం క్రితం విడాకులు తీసుకున్నారని వెల్లడించారు. , ‘సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. అయితే కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ఇప్పుడు అన్నీ చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది. షోయబ్, సానియా కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారని మేము చెప్పాలనుకుంటున్నాము. ఈ విషయంలో ఇక చర్చ అనవసరం. కొత్త జీవితం ప్రారంభించిన షోయబ్‌ మాలిక్‌కు అభినందనలు. అలాగే ఈ కష్ట సమయంలో అందరూ సానియాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం’ అని తన ప్రకటనలో రాసుకొచ్చింది సానియా మీర్జా ఫ్యామిలీ.

ఇవి కూడా చదవండి

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక బంధం కేవలం 14 సంవత్సరాలు కొనసాగింది. గత కొంతకాలం వారు విడివిడిగా నివసిస్తున్నారు. అలాగే విడాకుల ఊహాగానాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇంతలోనే షోయబ్ మాలిక్ పెళ్లి వార్త బయటకు వచ్చింది. ఈ పాకిస్తానీ క్రికెటర్‌ ఆ దేశానికే చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సానియా తన కుమారుడు ఇజాన్‌తో కలిసి దుబాయ్‌లోనే జీవిస్తోంది.

షోయబ్ మాలిక్ పెళ్లి ఫొటోస్..

సానియా లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ 2026లో సిక్సర్ల వర్షం.. లిస్ట్‌లో తోపు ప్లేయర్లు
ఐపీఎల్ 2026లో సిక్సర్ల వర్షం.. లిస్ట్‌లో తోపు ప్లేయర్లు
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్