Shoaib Malik- Sana Javed: షోయబ్‌ మాలిక్‌ మూడో వివాహం.. అసలు ఎవరీ సనా జావేద్‌? ఇద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్ ఎంతో తెలుసా?

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడాకులు తీసుకుంటున్నాడంటూ ప్రచారం సాగుతుండగానే అదే దేశానికి చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌ తో కలిసి నిఖా పక్కా చేసుకున్నాడు.

Basha Shek

|

Updated on: Jan 21, 2024 | 11:44 AM

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడాకులు తీసుకుంటున్నాడంటూ ప్రచారం సాగుతుండగానే అదే దేశానికి చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌ తో కలిసి నిఖా పక్కా చేసుకున్నాడు.

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడాకులు తీసుకుంటున్నాడంటూ ప్రచారం సాగుతుండగానే అదే దేశానికి చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌ తో కలిసి నిఖా పక్కా చేసుకున్నాడు.

1 / 9
శనివారం (జనవరి 20) తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను షోయబ్‌ మాలికే స్వయంగా ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నాడు. దీంతో షోయబ్‌, సనాల పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే షోయబ్‌ సానియాతో విడాకులు తీసుకున్నాడా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

2 / 9
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ మధ్య సంబంధాలు చాలా కాలం క్రితమే దెబ్బతిన్నాయి. కొద్ది రోజుల క్రితం సానియా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసింది. 'పెళ్లి, విడాకులు రెండూ కష్టమే' అంటూ విడాకులపై హింట్‌ ఇచ్చింది.

3 / 9

4 / 9
షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న సనా జావేద్ ఎవరో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో సెర్చ్ మొదలైంది. సనా జావేద్ ప్రముఖ పాకిస్థానీ నటి.  సౌదీ అరేబియాలోని జెడ్డాలో మార్చి 25, 1993న ఆమె జన్మించింది.

5 / 9
సనా జావేద్ 2020లో కరాచీలో పాకిస్థాన్ గాయకుడు ఉమర్ జస్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది కాలానికే వారు విడిపోయారు. ఆ తర్వాత షోయబ్‌తో ప్రేమలో పడింది. తరచూ సినిమా ఫంక్షన్లతో ఇద్దరూ కలుస్తుండడంతో వీరి పరిచయం మొదలైంది. ఆ తర్వాత ప్రేమగా చిగురించింది.

6 / 9
 ఆమె బేహద్, షరీక్-ఎ-హయత్, డినో కి దుల్హనియా, ఐ లవ్ యు జాదా వంటి ప్రముఖ టెలి సినిమాల్లో నటించి మెప్పించింది.  తన అందం, అభినయానికి గుర్తింపుగా పలువురి ప్రశంసలు, పురస్కారాలు
 లు కూడా గెల్చుకుంది.

ఆమె బేహద్, షరీక్-ఎ-హయత్, డినో కి దుల్హనియా, ఐ లవ్ యు జాదా వంటి ప్రముఖ టెలి సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయానికి గుర్తింపుగా పలువురి ప్రశంసలు, పురస్కారాలు లు కూడా గెల్చుకుంది.

7 / 9
సనా జావేద్ 2012లో షెహర్-ఎ-జాత్ సినిమాతో అరంగేట్రం చేసింది. పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించింది. రొమాంటిక్ డ్రామా 'ఖని'లో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత సనాకు బాగా గుర్తింపు వచ్చింది.

8 / 9
షోయబ్‌ మాలిక్‌ తో వివాహమైన వెంటనే తన పేరును ' సనా షోయబ్‌ మాలిక్‌'గా మార్చేసుకుంది సనా జావేద్. ప్రస్తుతం సనా పేరు నెట్టింట బాగా ట్రెండ్‌ అవుతోంది.   ఇక సనా కంటే షోయబ్‌ ఏకంగా 11 ఏండ్లు పెద్దవాడు.

9 / 9
Follow us