- Telugu News Photo Gallery Cricket photos Hyderabad Captain Tilak Varma History 2nd Consecutive Century In Ranji Trophy 2024
Ranji Trophy 2024: పేలవ ఫాంతో టీమిండియా నుంచి ఔట్.. కట్‌చేస్తే.. రంజీలో వరుసగా 2వ సెంచరీ బాదిన హైదరాబాదీ..
Ranji Trophy 2024: సిక్కింతో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తరుపున 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ 111 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పేలవ ఫాంతో టీమిండియా నుంచి ఔటైన ఈ హైదరాబాదీ వరుసగా రెండు సెంచరీలతో మరలా ఫాంలోకి వచ్చాడు.
Updated on: Jan 20, 2024 | 4:28 PM

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఈ ఎడిషన్‌లో వరుసగా రెండో సెంచరీని సాధించాడు.

ఈ ఏడాది రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ జట్టు సిక్కింతో మూడో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో సిక్కిం జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు 463 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

సిక్కింతో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తరుపున 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ 111 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

అతనితో పాటు, తన్మయ్ అగర్వాల్ కూడా హైదరాబాద్ తరపున 137 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ సింగ్ 83 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా సిక్కింపై తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ ఆధిక్యాన్ని కొనసాగించింది.

రంజీలో తిలక్ వర్మ ప్రదర్శన గురించి మాట్లాడితే, ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో అంటే నాగాలాండ్‌పై తిలక్ 100 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు భారత జట్టులో భాగంగా తిలక్ రెండో రంజీ మ్యాచ్ ఆడలేకపోయాడు.

ప్రస్తుతం రంజీల్లో సెంచరీ బాదిన తిలక్ వర్మ.. భారత టీ20 జట్టులో మిడిల్ ఆర్డర్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ, అఫ్గానిస్థాన్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అతని బ్యాట్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు.

ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా తిలక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఇలా ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు టీమ్ ఇండియాలో పేలవ ఫామ్ తో సతమతమవుతున్న తిలక్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.





























