ODI Records: ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాట్స్‌మెన్స్.. వన్డేల్లో టాప్ 5 లిస్ట్ ఇదే..

ఎంతోమంది బ్యాటర్లు బౌలర్లను లక్ష్యంగా చేసుకుని పరుగులు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది బౌలర్లు ఒకే ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బ్యాట్స్‌మెన్ తరచుగా ఒక నిర్దిష్ట బౌలర్‌ను లక్ష్యంగా చేసుకుంటారు. వారి స్పెల్స్‌లో భారీగా పరుగులు రాబడుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ODI Records: ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాట్స్‌మెన్స్.. వన్డేల్లో టాప్ 5 లిస్ట్ ఇదే..
Teamindia
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 21, 2024 | 9:52 PM

ODI Records: టీ20 ఎంట్రీ ఇచ్చిన తర్వాత వన్డే క్రికెట్‌లో మైదానంలో పరుగుల వర్షం రావడం మొదలైంది. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అన్ని జట్లు దాదాపుగా 300కి పైగా పరుగులు సాధిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో బౌలర్లు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. ఎంతోమంది బ్యాటర్లు బౌలర్లను లక్ష్యంగా చేసుకుని పరుగులు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది బౌలర్లు ఒకే ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు, పరుగులు రాబట్టిన బ్యాటర్ల లిస్టులో చాలామంది ఉన్నారు.

బ్యాట్స్‌మెన్ తరచుగా ఒక నిర్దిష్ట బౌలర్‌ను లక్ష్యంగా చేసుకుంటారు. వారి స్పెల్స్‌లో భారీగా పరుగులు రాబడుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వన్డేల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ వీరే..

5. జేమ్స్ నీషమ్ (న్యూజిలాండ్)

తిసార పెరీరా వేసిన ఓవర్లో న్యూజిలాండ్ పేలుడు బ్యాట్స్‌మెన్ జేమ్స్ నీషమ్ చాలా పరుగులు చేశాడు. 2018/19లో, మౌంట్ మౌన్‌గనుయ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ODI మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో, తిసారా పెరీరా వేసిన ఒకే ఓవర్‌లో జేమ్స్ నీషమ్ 34 పరుగులు రాబట్టాడు.

4. ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)

సిడ్నీలో జరిగిన 2014/15 ప్రపంచ కప్ మ్యాచ్‌లో, వెస్టిండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్ వేసిన ఓవర్‌లో ఏబీ డివిలియర్స్ అత్యధిక పరుగులు రాబట్టాడు. హోల్డర్ వేసిన ఆ ఓవర్‌లో అతను మొత్తం 34 పరుగులు చేశాడు.

3. తిసార పెరీరా (శ్రీలంక)

దక్షిణాఫ్రికాపై శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిసార పెరీరా ఈ ఘనత సాధించాడు. 2013లో పల్లెకెలెలో శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో, అతను ఆర్‌జే పీటర్సన్ వేసిన ఒక ఓవర్లో వేగంగా 35 పరుగులు చేశాడు.

2. జస్కరన్ మల్హోత్రా (యూఎస్ఏ)

2021లో పాపువా న్యూ గినియాపై అమెరికా బ్యాట్స్‌మెన్ జస్కరన్ మల్హోత్రా ఈ ఘనత సాధించాడు. 124 బంతుల్లో 4 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 173 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో, జస్కరన్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత సాధించాడు. జి టోకా వేసిన ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు.

1. హెర్షెల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా)

2007 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై హర్షల్ గిబ్స్ ఈ ఘనత సాధించాడు. డాన్ వాన్ బంగే వేసిన ఓవర్లో 6 బంతుల్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి మొత్తం 36 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..