Guntur Kaaram OTT: అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే ఓటీటీలో గుంటూరు కారం.. మహేశ్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

గుంటూరు కారం కూడా సలార్‌నే అనుసరిస్తుందా? మహేశ్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌ విషయంలో ట్విస్ట్‌ ఇవ్వనున్నారా? ప్రభాస్ సినిమా లాగే అనుకున్న తేదీ కంటే ముందుగానే మహేశ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్‌ మీడియా సర్కిల్‌లో

Guntur Kaaram OTT: అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే ఓటీటీలో గుంటూరు కారం.. మహేశ్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Guntur Kaaram Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2024 | 10:40 AM

గుంటూరు కారం కూడా సలార్‌నే అనుసరిస్తుందా? మహేశ్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌ విషయంలో ట్విస్ట్‌ ఇవ్వనున్నారా? ప్రభాస్ సినిమా లాగే అనుకున్న తేదీ కంటే ముందుగానే మహేశ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్‌ మీడియా సర్కిల్‌లో. మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో సినిమా గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఎప్పటిలాగే భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో మిక్స్‌డ్‌ టాక్‌ కూడా వచ్చింది. అయితే అది కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పటికే రూ.212 కోట్లు కలెక్ట్‌ చేసి మహేశ్ మ్యాజిక్ ఏంటో మరోసారి చూపించింది. ఇప్పటికీ గుంటూరు కారం సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. అయితే మహేశ్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సామాజి క మాధ్యమాల్లో కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ సలార్‌ సినిమాలాగే గుంటూరు కారం కూడా 28 రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోందని నెట్టింట ప్రచారం సాగుతోంది. గుంటూరు కారం సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. ఇందుకోసం సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్రతినిధులకు భారీ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారంలోనే గుంటూరు కారం సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీల్లో మహేశ్‌ సినిమా స్ట్రీమింగ్‌కు రావొచ్చు.

ప్రభాస్‌ నటించిన సలార్‌ సినిమా కూడా థియేట్రికల్‌ రిలీజ్‌ జరిగి నెల రోజులు పూర్తి కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మహేశ్‌ గుంటూరు కారం కూడా సలార్‌నే అనుసరిస్తుందని రూమర్స్‌ వస్తున్నాయి. అయితే గుంటూరు కారం ఓటీటీ రిలీజ్‌ పై అటు చిత్ర బృందం, అటు ఓటీటీ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. హారిని అండ్‌ హాసిని క్రియేష్స్‌ బ్యానర్‌పై ఎస్‌. రాధాకృష్ణ గుంటూరు కారం సినిమాను నిర్మించారు. రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, మురళీ శర్మ, జగపతిబాబు, బ్రహ్మాజీ, అజయ్‌, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, సునీల్‌ తదితరులు గుంటూరు కారంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

గుంటూరు కారం ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే