AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం 5 జట్ల పోటీ.. ముంబై నుంచి ట్రేడ్ చేయడానికి ఎవరు ఏ స్టార్‌ను ఇస్తారంటే?

Hardik Pandya: ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముంబై ఇండియన్స్ స్టార్ కోసం CSK, KKR, DC, LSG, RR ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్షర్ పటేల్, నికోలస్ పూరన్, యశస్వి జైస్వాల్ వంటి పేర్లతో ట్రేడ్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం 5 జట్ల పోటీ.. ముంబై నుంచి ట్రేడ్ చేయడానికి ఎవరు ఏ స్టార్‌ను ఇస్తారంటే?
Hardik Pandya
Rakesh
|

Updated on: Aug 11, 2026 | 2:43 PM

Share

Hardik Pandya: ఐపీఎల్ 2027 సీజ‎న్‎కు ఇంకా చాలా సమయం ఉంది. అంతకుముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యా వీడబోతున్నాడనే ప్రచారం జరుగుతున్న వేళ, మొదట్లో కేవలం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాత్రమే రేసులో ఉన్నాయనే వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఏకంగా 5 ఐపీఎల్ జట్లు హార్దిక్‌ను తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద వ్యూహాలనే రచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీమ్‌లు తమ స్టార్ ప్లేయర్లను ఇచ్చి అయినా హార్దిక్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి.

ఢిల్లీ, లక్నోల వ్యూహాలు

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి అక్షర్ పటేల్‌ను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చే ప్రతిపాదన తెచ్చే అవకాశముంది. గత కొన్నేళ్లుగా ముంబై వద్ద స్ట్రాంగ్ స్పిన్ ఆల్ రౌండర్ లేకపోవడం, అక్షర్‌కు లీడర్‌షిప్ స్కిల్స్ ఉండటం దీనికి కలిసివచ్చే అంశం. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ పవర్‌ఫుల్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను ముంబైకి పంపి, హార్దిక్‌ను తెచ్చుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మిచెల్ మార్ష్ వంటి ఆల్ రౌండర్ ఉన్నప్పటికీ, అతను బౌలింగ్ తక్కువగా చేస్తుండటంతో LSG హార్దిక్ కోసం ఆరాటపడుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ లెక్కలు

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విషయానికొస్తే.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణతో ఖాళీ అయిన హెడ్ కోచ్ పదవిని భర్తీ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ ట్రేడ్ కుదిరితే హార్దిక్ కోసం శివమ్ దూబే, ఆయుష్ మ్హాత్రే లేదా డెవాల్డ్ బ్రెవిస్ వంటి ఇద్దరు ఆటగాళ్లను చెన్నై వదులుకోవాల్సి రావచ్చు. అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద రూ. 25.2 కోట్లకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత యాషెస్ సిరీస్ ఉన్నందున గ్రీన్ అందుబాటుపై అనుమానాలు ఉన్నాయి. కాబట్టి గ్రీన్ ట్రేడ్ ముంబైకి పెద్దగా లాభదాయకం కాకపోవచ్చు.

రాజస్థాన్ రాయల్స్ దిమ్మతిరిగే ప్లాన్

రాజస్థాన్ రాయల్స్ వద్ద రవీంద్ర జడేజా, సామ్ కరన్, డోనోవన్ ఫెరేరా, దాసున్ షనక వంటి టాప్ క్లాస్ ఆల్ రౌండర్ల జాబితా పెద్దగానే ఉంది. కానీ, హార్దిక్ పాండ్యా వంటి పవర్‌ఫుల్ ఇండియన్ ఆల్ రౌండర్‌ను టీమ్‌లోకి తెచ్చుకోవడానికి అవసరమైతే తమ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కూడా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు వార్తలు రావడం గమనార్హం. ఏది ఏమైనా, హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ పూర్తయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ఆటగాళ్ల బదిలీగా నిలిచిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us