Animal OTT: ‘యానిమల్‌’ ఓటీటీ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌.. అదనపు సీన్స్‌తో కలిపి స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?

డిసెంబర్‌ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్‌ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా రూ.900 కోట్ల మేర వసూళ్లు రాబట్టి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో యానిమల్‌ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. మరికొన్ని రోజుల్లో యానిమల్ ఓటీటీలో ప్రత్యక్షం కానుంది

Animal OTT: 'యానిమల్‌' ఓటీటీ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌.. అదనపు సీన్స్‌తో కలిపి స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?
Animal Movie OTT
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2024 | 1:38 PM

టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా, బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటించింది. అలాగే మరో బాలీవుడ్‌ బ్యూటీ తృప్తి దిమ్రీ ఒక కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్‌ విలన్‌ గా మెప్పించగా, రణ్‌ బీర్‌ తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ అలరించారు. డిసెంబర్‌ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్‌ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా రూ.900 కోట్ల మేర వసూళ్లు రాబట్టి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో యానిమల్‌ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. మరికొన్ని రోజుల్లో యానిమల్ ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26 నుంచి యానిమల్‌ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. అయితే థియేట్రికల్‌ వెర్షన్‌కు అదనంగా మరో 20 నిమిషాలు జత చేసి ఓటీటీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిపై డైరెక్టర్‌ సందీప్‌ కూడా ఇది వరకే ఇచ్చాడు. అయితే యానిమల్‌ ఓటీటీ రిలీజ్ గురించి అటు చిత్ర బృందం, ఇటు నెట్‌ఫ్లిక్స్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

కాగా ఇటీవలే యానిమల్‌ సినిమా ఓటీటీ  విడుదలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు సమన్లు ​​జారీ చేసింది. ‘యానిమల్’ OTT విడుదలపై స్టే విధించాలని కోరుతూ సినీ వన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు నెట్‌ఫ్లిక్స్ అలాగే నిర్మాతలకు సమన్లు ​​జారీ చేసింది. అయితే ఇప్పుడీ వివాదం సమసిపోయిందని తెలుస్తోంది. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, కృషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్‌తో సహా ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమా కోసం పని చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

గణతంత్ర దినోత్సవం కానుకగా..

అదనపు సీన్స్ తో కలిపి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.