Suhas: అయోధ్య రామోత్సవం రోజున తండ్రైన సుహాస్‌.. ‘ప్రొడక్షన్‌ నంబర్‌ వన్‌’ అంటూ ఫొటోలు షేర్‌ చేసిన హీరో

దేశమంతా రామనామం జపిస్తోన్న శుభ సందర్భంలో టాలీవుడ్‌ ప్రముఖ హీరో సుహాస్‌ ఇంట వారసుడు అడుగుపెట్టాడు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజునే తండ్రిగా ప్రమోషన్‌ పొందాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. సోమవారం (జనవరి 22) సుహాస్‌సతీమణి లలిత పండంటి మగ బిడ్డను ప్రసవించింది.

Suhas: అయోధ్య రామోత్సవం రోజున తండ్రైన సుహాస్‌.. 'ప్రొడక్షన్‌ నంబర్‌ వన్‌' అంటూ ఫొటోలు షేర్‌ చేసిన హీరో
Suhas Family
Follow us
Basha Shek

|

Updated on: Jan 22, 2024 | 5:02 PM

దేశమంతా రామనామం జపిస్తోన్న శుభ సందర్భంలో టాలీవుడ్‌ ప్రముఖ హీరో సుహాస్‌ ఇంట వారసుడు అడుగుపెట్టాడు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజునే తండ్రిగా ప్రమోషన్‌ పొందాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. సోమవారం (జనవరి 22) సుహాస్‌సతీమణి లలిత పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుని మురిసిపోయాడు సుహాస్‌. తన భర్త, కుమారుడితో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన హీరో ‘ఇట్స్‌ ఏ బేబీ బాయ్‌, ‘ప్రొడక్షన్ నం.1’ అని ఓ ఫన్నీ క్యాప్షన్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సుహాస్‌ సతీమణి పేరు లలిత. వీరిది ప్రేమ వివాహం. దాదాపు ఏడేళ్ల పాటు మరీ ప్రేమించుకుని మరీ ఏడడుగులునడిచారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అందుకే లేచిపోయి మరీ 2017లో పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడీ ప్రేమ బంధానికి గుర్తింపుగానే ఒక బిడ్డకు జన్మనిచ్చారు సుహాస్‌, లలిత.

షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా కెరీర్‌ ప్రారంభించి ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్‌. మొదట కమెడియన్‌గా, సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించి మెప్పించిన అతను కలర్‌ ఫొటో సినిమాలో హీరోగానూ మెప్పించాడు. ఆ తర్వాత గమనం, ఫ్యామిలీ డ్రామా, అడివిశేష్‌ హిట్‌ 2 సినిమాల్లో సైకో కిల్లర్‌ పాత్రలు పోషించి అందరినీ భయపెట్టాడు. రైటర్‌ పద్మభూషణ్‌ సినిమాతో హీరోగా మరో హిట్ కొట్టాడు. సుహాస్‌ హీరోగా నటిస్తోన్న ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’.. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దుష్యంత్ కాటికినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈసినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనుంది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాదు… ఈ సినిమాపై మంచి అంచనాలను పెరిగేలా చేసింది.

ఇవి కూడా చదవండి

కుమారుడితో హీరో సుహాస్..

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

భార్యతో సుహాస్..

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్  ప్రారంభించి హీరోగా..

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

త్వరలోనే అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!