Virat Kohli: అయోధ్యలో విరాట్‌ కోహ్లీ డూప్‌.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్‌.. వైరల్‌ వీడియో

అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సోమవారం (జనవరి 22) న జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్నికళ్లారా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అందుకు తగ్గట్టుగానే సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తమ భాగస్వాములతో ఈ మహా క్రతువుకు హాజరయ్యారు.

Virat Kohli: అయోధ్యలో విరాట్‌ కోహ్లీ డూప్‌.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్‌.. వైరల్‌ వీడియో
Virat Kohli
Follow us

|

Updated on: Jan 23, 2024 | 12:30 PM

అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సోమవారం (జనవరి 22) న జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్నికళ్లారా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అందుకు తగ్గట్టుగానే సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తమ భాగస్వాములతో ఈ మహా క్రతువుకు హాజరయ్యారు. అయితే ఆహ్వానం అందినా కూడా కొంతమంది ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. అందులో విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు కూడా ఉన్నారు. అయితే అచ్చంగా కోహ్లీలాగే ఉండే ఒక వ్యక్తి అయోధ్యలో సందడి చేశాడు. టీమిండియా జెర్సీ ధరించి అభిమానులతో ముచ్చటించాడు. అతను కోహ్లీ డూప్ అని తెలిసినా చుట్టుముట్టి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం విశేషం. మొదట చాలా సరదాగా సాగిన ఈ తతంగం ఆ కాసేపటికే తోపులాట దాకా వెళ్లింది. దీంతో కోహ్లీ డూప్‌ సైతం బెదిరపోయాడు. చుట్టూఉన్న జనంలోంచి అతి కష్టమ్మీద ఎలాగోలా బయట పడ్డాడు. ఆపై వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోహ్లీకే కాదు, అతని డూప్‌కు కూడా అభిమానుల బెడద తప్పడం లేదంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి వైదొలిగిన కోహ్లి.. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టులో చేరే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల కింగ్ కోహ్లీ 2 మ్యాచ్‌లకు అందుబాటులో లేడని బీసీసీఐ తెలిపింది. అయితే తాను తప్పుకోవడంపై ఎలాంటి ఊహాగానాలు సృష్టించవద్దని, భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన ప్రథమ ప్రాధాన్యమని కోహ్లీ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మరోవైపు కోహ్లీ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాలని బీసీసీఐ తన మీడియా ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రీ ఎంట్రీ ఎప్పుడంటే?

గురువారం నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. అంటే మూడో టెస్టు మ్యాచ్ నాటికి భారత జట్టులో చేరనున్నాడు. ఫిబ్రవరి 15 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 3వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజ్‌కోట్‌లో జరిగే ఈ మ్యాచ్ ద్వారా అతను పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల కోసం టీమిండియాను ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా కనిపించనున్నారు. ఇప్పుడు విరాట్‌ కోహ్లి ఔట్‌ కావడంతో అతడి స్థానంలో మరో వ్యక్తిని ఎంపిక చేయాల్సి ఉంది.

వైరలవుతోన్న ఫ్యాన్ మేడ్ పోస్టర్స్..

భారత టెస్టు జట్టు (మొదటి రెండు మ్యాచ్‌లకు):

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ