AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024: అమ్మాయిల ప్రీమియర్‌ లీగ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. మొదటి మ్యాచ్‌ ఎప్పుడంటే? పూర్తి షెడ్యూల్‌ ఇదిగో

మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్-2 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిబ్రవరి 24 నుండి..

WPL 2024: అమ్మాయిల ప్రీమియర్‌ లీగ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. మొదటి మ్యాచ్‌ ఎప్పుడంటే? పూర్తి షెడ్యూల్‌ ఇదిగో
WPL 2024
Basha Shek
|

Updated on: Jan 23, 2024 | 1:22 PM

Share

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024) సీజన్-2 షెడ్యూల్ వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల క్రికెట్ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుండగా, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి రెండు నగరాల్లో టోర్నీ జరగబోతోంది. దీని ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి దశ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే ఫైనల్‌తో సహా రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్‌లో జరగనున్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్-2 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిబ్రవరి 24 నుండి తమ WPL  సమరాన్ని  ప్రారంభించనుంది. వారి మొదటి మ్యాచ్‌లో UP వారియర్స్‌తో తలపడుతుంది. 2023లో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచి తొలి మహిళల ప్రీమియర్ లీగ్ ట్రోఫీని గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

WPL 2024 పూర్తి షెడ్యూల్:

  • ఫిబ్రవరి 23- ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 26 – UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 27 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 28 – ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 29 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  • మార్చి 1 – UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
  • మార్చి 2 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు)
  • మార్చి 3 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  • మార్చి 4 – UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ (బెంగళూరు)
  • మార్చి 5 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
  • మార్చి 6 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
  • మార్చి 7 – UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
  • మార్చి 8 – ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ (ఢిల్లీ)
  • మార్చి 9 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
  • మార్చి 10 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
  • మార్చి 11 – గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్ (ఢిల్లీ)
  • మార్చి 12 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
  • మార్చి 13 – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
  • మార్చి 15 – ఎలిమినేటర్ (ఢిల్లీ)
  • మార్చి 17 – ఫైనల్ (ఢిల్లీ)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్