AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Awards: రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం.. గిల్‌కి పాలీ ఉమ్రిగర్‌ అవార్డు.. లిస్టు ఇదిగో.!

నమన్‌ అవార్డ్స్‌ పేరిట అవార్డులను అందించింది బీసీసీఐ. భారత మాజీ ఆల్‌రౌండర్‌, కోచ్‌ రవిశాస్త్రి.. కర్నల్‌ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, సెక్రటరీ జై షా రవిశాస్త్రికి అవార్డును అందించారు.

BCCI Awards: రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం.. గిల్‌కి పాలీ ఉమ్రిగర్‌ అవార్డు.. లిస్టు ఇదిగో.!
Bcci Awards
Ravi Kiran
|

Updated on: Jan 24, 2024 | 9:05 AM

Share

నమన్‌ అవార్డ్స్‌ పేరిట అవార్డులను అందించింది బీసీసీఐ. భారత మాజీ ఆల్‌రౌండర్‌, కోచ్‌ రవిశాస్త్రి.. కర్నల్‌ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, సెక్రటరీ జై షా రవిశాస్త్రికి అవార్డును అందించారు. భారత క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 1981 నుంచి 1992 మధ్య 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన శాస్త్రి కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. రిటైర్మెంట్‌ తర్వాత.. వ్యాఖ్యాతగా మారిన ఆయన 2014 నుంచి 2016 వరకు ఇండియా క్రికెట్‌ జట్టుకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనతోపాటు ఫరూక్‌ ఇంజనీర్‌ కూడా ఈ అవార్డు అందుకున్నారు. ఇక పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ క్రికెటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌(2022-23) నిలవగా, బుమ్రా(2021–22), రవిచంద్రన్‌ అశ్విన్‌(2020–21), మహ్మద్‌ షమీ(2019–20) సైతం అవార్డులను గెలుచుకున్నారు.

ఉత్తమ మహిళా క్రికెటర్లుగా..స్మృతి మందాన(2020–21, 2021–22), దీప్తి శర్మ(2019–20, 2022–23) అవార్డులను అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఓపెనర్‌గా అడుగుపెట్టి విధ్వంసం సృష్టిస్తోన్న యశస్వి జైస్వాల్‌‌కు 2022–23 సీజన్‌కు గానూ ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు దక్కింది. ఈ విభాగంలో మయాంక్‌ అగర్వాల్‌ (2019-20), అక్షర్‌ పటేల్‌ (2020-21), శ్రేయస్‌ అయ్యర్‌ (2021-22) ఆయా సీజన్లకు ఈ అవార్డును దక్కించుకున్నారు. అలాగే వీరితో పాటు మరికొన్ని వివిధ విభాగాల్లో పలువురు క్రికెటర్లు బీసీసీఐ అవార్డులు గెలుచుకున్నారు.

కాగా, కరోనా కారణంగా 2019-23(2019-20, 2020-21, 2021-22, 2022-23) సీజన్లకు గానూ బీసీసీఐ వార్షిక అవార్డులను ప్రధానం చేయలేకపోయింది. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నాలుగు సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళల, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు.