Saif Ali Khan: ఎన్టీఆర్‌ ‘దేవర’ విలన్‌కు అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిన సైఫ్‌ అలీఖాన్‌.. కారణమిదే

ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాలో రావణాసురుడిగా విలన్‌గా భయపెట్టాడు ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌. ఇందులో లంకాధీశుడిగా సైఫ్‌ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడిదే కోవలో మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్నాడు సైఫ్‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తోన్న దేవర సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడీ బాలీవుడ్‌ సీనియర్‌ హీరో.

Saif Ali Khan: ఎన్టీఆర్‌ 'దేవర' విలన్‌కు అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిన సైఫ్‌ అలీఖాన్‌.. కారణమిదే
Devara Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 23, 2024 | 12:59 PM

ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాలో రావణాసురుడిగా విలన్‌గా భయపెట్టాడు ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌. ఇందులో లంకాధీశుడిగా సైఫ్‌ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడిదే కోవలో మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్నాడు సైఫ్‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తోన్న దేవర సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడీ బాలీవుడ్‌ సీనియర్‌ హీరో. భైరా అనే రోల్‌కు సంబంధించి ఇప్పటికే రిలీజైన లుక్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే ఇటీవల దేవర షూటింగ్‌లో సైఫ్‌కు గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటనలూ చేయలేదు. అయితే ఇప్పుడు సడెన్‌గా ఆస్పత్రిలో చేరాడు సైఫ్‌. కొన్నాళ్ల ముందు దేవర సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు షూట్‌ చేస్తున్నప్పడు సైఫ్ మోకాలి, భూజానికి గాయాలయ్యాయట. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోలేద సైఫ్‌.

అయితే ఇప్పుడు ఆ గాయాలు మళ్లీ తిరగబెట్టడం, సీరియస్ కావడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరాడు సైప్‌ అలీఖాన్‌. ట్రైసప్(కండ) సర్జరీ కచ్చితంగా చేయాలని డాక్టర్లు చెప్పడంతో ఇప్పుడు ఆ శస్త‍్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై దేవర చిత్రబృందం స్పందించింది. సైఫ్‌ త్వరగా కోలుకోవాలని తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

గాయం తిరగబెట్టడంతో..

ముంబైలోని ఆస్పత్రిలో బాలీవుడ్ హీరో..

దేవర సినిమాలో సైఫ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!