Vijayakanth: మరణానంతరం కెప్టెన్ విజయకాంత్‌కు పద్మ భూషణ్‌ పురస్కారం.. అభిమానులకు అంకితమిచ్చిన సతీమణి

మరణాంతరం ఓ స్టార్‌ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికవ్వడం గమనార్హం. ఆయనే కెప్టెన్‌ విజయ్‌కాంత్. సినిమా, రాజకీయ రంగాల్లో కెప్టెన్‌ సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కెప్టెన్‌ అభిమానుల్లో చాలామంది సంతోషపడుతున్నారు. అదే సమయంలో విజయ్‌ కాంత్‌ మన మధ్యలేకపోవడం విచారమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Vijayakanth: మరణానంతరం కెప్టెన్ విజయకాంత్‌కు పద్మ భూషణ్‌ పురస్కారం.. అభిమానులకు అంకితమిచ్చిన సతీమణి
Vijayakanth Family
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2024 | 11:51 AM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. మెగాస్టార్‌ చిరంజీవి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్‌ అవార్డుల వరించాయి. అయితే మరణాంతరం ఓ స్టార్‌ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికవ్వడం గమనార్హం. ఆయనే కెప్టెన్‌ విజయ్‌కాంత్. సినిమా, రాజకీయ రంగాల్లో కెప్టెన్‌ సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కెప్టెన్‌ అభిమానుల్లో చాలామంది సంతోషపడుతున్నారు. అదే సమయంలో విజయ్‌ కాంత్‌ మన మధ్యలేకపోవడం విచారమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ కాంత్‌కు పద్మభూషణ్‌ అవార్డు రావడంపై స్పందించిన ఆయన సతీమణి ప్రేమలతా విజయకాంత్‌ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారామె. అంతేకాదు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును విజయ్‌కాంత్‌ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ, ఆయన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రేమలతా విజయకాంత్‌ వెల్లడించారు.

స్టార్‌ హీరోగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కెప్టెన్‌ విజయ కాంత్‌ గతేడాది డిసెంబర్‌ 28న తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమైన ఆయన కరోనా బారిన పడడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రధాని మోడీ, సీఎం జగన్‌, కేసీఆర్‌, రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, రవితేజ, నాని తదితర సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్‌ కాంత్‌కు నివాళి అర్పించారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో విజయ కాంత్‌ అంత్యక్రియలను నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

విజయకాంత్ అంత్యక్రియల్లో రజనీ కాంత్

విజయ్ ఆంటోని నివాళులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..