Niharika Konidela: చైతన్యతో విడాకుల పై ఫస్ట్ టైం నోరు విప్పిన నిహారిక.! వీడియో.

Niharika Konidela: చైతన్యతో విడాకుల పై ఫస్ట్ టైం నోరు విప్పిన నిహారిక.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Jan 27, 2024 | 1:10 PM

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‏గా అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్‏గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనపరంగా.. కంటెంట్ ఎంపిక పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది నిహారిక. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి జరిగింది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరం విడిపోయామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా..

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‏గా అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్‏గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనపరంగా.. కంటెంట్ ఎంపిక పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది నిహారిక. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి జరిగింది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరం విడిపోయామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా.. అందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. డివోర్స్ ప్రకటన తర్వాత ఎవరికి వారు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక… ఇప్పుడు నిర్మాతగా మారి సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అలాగే ఇటు నటిగా తిరిగి రీఎంట్రీ కూడా ఇస్తోంది. ఇక ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మొదటిసారి తన విడాకుల గురించి మనసు విప్పి మాట్లాడింది.

తన జీవితంలో పెళ్లి, విడాకులు, స్నేహితులు, ఫ్యామిలీ, సినిమాలు ఇలా అన్ని అంశాల గురించి మాట్లాడింది. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని..చాలా ఏడ్చానని చెప్పుకొచ్చింది. తనది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం.. కొన్ని విషయాల్లో వర్కౌట్ కాక విడపోవాల్సి వచ్చిందని తెలిపింది. మనుషులను నమ్మకూడదని అర్థమైందని.. పెళ్లితో ఓ పాఠం నేర్చుకున్నానని… కానీ విడాకుల తర్వాత చాలా బాధగా ఉందని.. అందరూ తననే కామెంట్స్ చేశారని.. చెప్పింది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, నెగిటివిటీ చూసి చాలా బాధపడ్డానని.. అలాంటి సమయంలో తన ఫ్యామిలీ తనకు సపోర్ట్ గా నిలబడిందని ఎమోషనల్ అయ్యింది నిహారిక. ఆ బాధ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని.. ప్రస్తుతం ఒంటరిగా చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos