Megastar Chiranjeevi: అక్కినేని తర్వాత.. ఈ ఘనత సాధించింది ఒక్క మెగాస్టారే.!

Megastar Chiranjeevi: అక్కినేని తర్వాత.. ఈ ఘనత సాధించింది ఒక్క మెగాస్టారే.!

Anil kumar poka

|

Updated on: Jan 27, 2024 | 1:17 PM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గానూ ఈ గౌరవం లభిస్తుంది. అయితే తాజాగా ప్రకటించిన అవార్డులలో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు.. మాజీ ఊపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గానూ ఈ గౌరవం లభిస్తుంది. అయితే తాజాగా ప్రకటించిన అవార్డులలో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు.. మాజీ ఊపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మ విభూషణ్ అవార్డ్ కేవలం ఒక్క హీరోకు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డ్ అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.

ఇంతకీ చిరు కంటే ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరో ఎవరో తెలుసా?. ఆయనే నట దిగ్గజం.. దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు. 2011లో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుకు పద్మవిభూషణ్ అవార్డ్ ప్రకటించింది కేంద్రం. ఆయన తర్వాత ఇన్నాళ్లకు.. చిరంజీవిని ఈ అవార్డ్ వరించింది. దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో ఈ అవార్డ్ కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరికి మాత్రమే కాకుండా భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. వారిలో సినీరంగంలో.. ప్రస్తుతం వీరిద్దరి పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos