Mahesh Babu : రాజమౌళి సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోని మహేష్.. కారణం ఏంటంటే

శ్రీలీల హీరోయిన్ గా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుంటూరు కారం సినిమా 200కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Mahesh Babu : రాజమౌళి సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోని మహేష్.. కారణం ఏంటంటే
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 28, 2024 | 1:25 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ నుంచి తేరుకొని హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గుంటూరు కారం సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుంటూరు కారం సినిమా 200కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఈ సినిమా కథ పూర్తయ్యిందని స్టార్ రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాను దాదాపు 1000కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరో.. ఒకొక్క సినిమాకు 70 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు మహేష్. అయితే రాజమౌళి సినిమా కోసం ఏకంగా 100 కోట్లవరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ లేకుండా రాజమౌళి సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే సినిమా లాభాల్లో వాటా తీసుకుంటాడని తెలుస్తోంది. అటు రాజమౌళి కూడా రెమ్యునరేషన్ లేకుండా సినిమా లాభంలో వాటా తీసుకుంటారని తెలుస్తోంది.ఇక మహేష్ సినిమా కోసం విదేశీ ముద్దుగుమ్మను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు ట్విట్టర్ పోస్ట్

మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.