Chiranjeevi: ‘అమ్మకు ప్రేమతో’.. అంజనాదేవి బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. ఫొటోస్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అన్నయ్యను వరించింది కదా.. పండగ కాక ఇంకేముంటది అనుకుంఉన్నారా? అయితే ఈ పండగకు వేరే కారణముంది. అదే చిరంజీవిని
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అన్నయ్యను వరించింది కదా.. పండగ కాక ఇంకేముంటది అనుకుంఉన్నారా? అయితే ఈ పండగకు వేరే కారణముంది. అదే చిరంజీవిని కనిపెంచి, ఈ సినిమా ప్రపంచానికి అందించిన తల్లి అంజనా దేవి పుట్టిన రోజు ఇవాళ (జనవరి 29). ఈనేపథ్యంలో తల్లి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు చిరంజీవి. తల్లితో స్వయంగా కేక్ చేయించి బర్త్ డే విషెస్ చెప్పారు. అనంతరం అంజనమ్మ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజికి మాధ్యమాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో చిరంజీవికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులతో సహా క్రీడా, రాజకీయ సెలబ్రిటీస్ అన్నయ్య ఇంటికెళ్లి మరీ అభినందనలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ , సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది.
కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.💐💐 pic.twitter.com/MFOttIdoPj
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2024
మరో పద్మ విభీషణుడు వెంకయ్య నాయుడితో..
Shared some delightful and very special moments with Shri. @MVenkaiahNaidu garu!
Being a fellow recipient of the prestigious honour makes the mutually congratulatory meeting extra joyous and memorable !🙏 #PadmaVibhushan pic.twitter.com/q5yF5L2nYO
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024
చిరంజీవితో కేఎస్ భరత్..
Indian Cricketer #KSBharat Met Boss MegaStar ✨ @KChiruTweets Garu and Congratulated him for Padma Vibhushan 💐#PadmaVibhushanChiranjeevi 🧎 pic.twitter.com/IgD1UJfd1A
— Ujjwal Reddy (@HumanTsunaME) January 29, 2024
‘సాయి కుమార్, ఆది సాయి కుమార్..
Congratulations annayya, @KChiruTweets for receiving prestigious Padma Vibhushan. #PadmaVibhushanChiranjeevi #PadmaVibhushan pic.twitter.com/ovaN8oBOrP
— SaiKumar (@saikumaractor) January 29, 2024
స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందితో..
Stylish Director @IamSampathNandi met and conveyed his best regards to #PadmaVibhushanChiranjeevi garu for being conferred with the Padma Vibhushan, India’s second-highest civilian award @KChiruTweets #SampanthNandi pic.twitter.com/iIBxlaxXIZ
— Teju PRO (@Teju_PRO) January 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.