IKEA: తెలుగు ప్రజలకు ఐకియా శుభవార్త.. ఇకపై ఇంటి వద్దకే..
ప్రజల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఐకియా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు వస్తువులను హోమ్ డెలివరి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మొత్తం 62 జిల్లాల్లో వేలాది ప్రాంతాలకు ఈ కామర్స్ డెలివరీలను ప్రారంభించినట్లు మంగళవారం తెలిపింది...
ఐకియా ఈ పేరును తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్వీడన్‌కు చెందిన ఈ హోమ్ ఫర్నిషింగ్ రైటలర్ సంస్థ హైదరాబాద్‌లో స్టోర్‌ను 2018లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జంట నగరాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాకు చెందిన పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కస్టమర్లకు ఐకియా స్టోర్‌కు వస్తుంటారు.
ప్రజల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఐకియా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు వస్తువులను హోమ్ డెలివరి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మొత్తం 62 జిల్లాల్లో వేలాది ప్రాంతాలకు ఈ కామర్స్ డెలివరీలను ప్రారంభించినట్లు మంగళవారం తెలిపింది. ఇతర రాష్ట్రాల ప్రజలకు సేవలను సులభతరం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐకియా తెలిపింది
ఇందులో భాగంగా కస్టమర్లకు మొత్తం 7500కిపైగా గృహోపకరణాలను ఇంటికి వద్దకే డెలివరీ చేయనున్నారు. కొనుగోలు దారులు ఐకియా మొబైల్ యాప్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లేదా ఫోన్ షాపింగ్ విధానంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. వినియోగదారుడి డెలివరీ ప్రదేశం ఆధారంగా ప్రొడక్ట్ డెలివరి సమయం ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇక ఐకీయా సీఈఓ అండ్ సీఎస్‌ఓ సుసానే పుల్వెరెర్ మాట్లాడుతూ.. ‘ఐకియా గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన కస్టమర్ల ప్రేమ, నమ్మకాన్ని పొందింది. మార్కెట్‌లో మా పరిధిని మరింత విస్తరించడం అంటే మా కస్టమర్‌లకు ఐకియాని మరింత అందుబాటులోకి తీసుకురావడం, మరింత సౌకర్యవంతంగా వస్తువులను అందించడం. ప్రస్తుత మార్కెట్‌లో 72 శాతం కస్టమర్ ఆర్డర్‌లు ఎలిక్ట్రిక్ వెహికిల్స్ ద్వారా డెలివరీ అవుతున్నాయి. ఈ విస్తరణలో భాగంగా ఐకియా సేవలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..