Hyderabad: రాష్ట్రపతి నిలయం సందర్శించాలనుకునేవారికి గుడ్ న్యూస్.. వారికి ఎంట్రీ ఫ్రీ.!
సుందర వనాలు.. సకల సౌకర్యాలు.. ఆహ్లాద పర్యాటక ప్రాంతంగా రాష్ట్రపతి నిలయం స్వాగతం పలుకుతోంది. సంవత్సరమంతా సందర్శకులకు ఆహ్వానం పలుకుతున్న రాష్ట్రపతి నిలయం.. మరింత అట్రాక్టివ్‌గా ఉండేలా సొబగులు అద్దుకుంది.
సుందర వనాలు.. సకల సౌకర్యాలు.. ఆహ్లాద పర్యాటక ప్రాంతంగా రాష్ట్రపతి నిలయం స్వాగతం పలుకుతోంది. సంవత్సరమంతా సందర్శకులకు ఆహ్వానం పలుకుతున్న రాష్ట్రపతి నిలయం.. మరింత అట్రాక్టివ్‌గా ఉండేలా సొబగులు అద్దుకుంది.
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శనకు అందరికీ గ్రాండ్ వెల్‌కమ్ చెబుతోంది. గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది తర్వాత 15 రోజులు మాత్రమే విజిట్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు నెల రోజులు మినహా మిగిలిన రోజులన్నీ చూసే వీలు కల్పించారు. అంతేనా ఎన్నో సరికొత్త హంగులు అద్ది.. రాష్ట్రపతి నిలయాన్ని సర్వత్రా టూరిస్ట్ బెస్ట్ స్పాట్‌గా మార్చారు. రాష్ట్రపతి నిలయంలో రాక్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, బటర్ ఫ్లై, నక్షత్ర గార్డెన్లు ప్రకృతి ఒడిలో ఒదిగిపోయేలా చేస్తాయి. మెయిన్ బిల్డింగ్ రాయల నివాసాన్ని తలపిస్తే.. ఆర్ట్ గ్యాలరీ ప్రెసిడెంట్ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ముఖ్యంగా రాక్ గార్డెన్‌లోని దక్షిణామూర్తి శివుడు, నందిరాతి శిలలపై నీటి ధారల దృశ్యం కనువిందు చేస్తాయి. పక్కనే ఉన్న పామ్ ట్రీస్ గార్డెన్ ఓ సుందరవనాన్ని తలపిస్తుంది. అందుతో అడుగు ఎత్తు నుంచి అతి భారీ చెట్లు ఒకే ఆకృతిలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
నక్షత్రపు గార్డెన్ డిజైన్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్. వ్యక్తుల జన్మ నక్షత్రం ఆధారంగా దానిలో అనువైన చెట్లు నాటారు. ఆ వృక్షం చుట్టూ ఆ నక్షత్రంలో జన్మించిన వారు ప్రదక్షిణలు చేస్తే ప్రశాంతత, పాజిటివ్ వైబ్స్ ఉంటాయని భావిస్తుంటారు. టన్నెల్ కిచెన్‌ను గతేడాది పునరుద్దరించారు. టన్నెల్‌లో నడిచే అనుభుతి.. అందమైన చేర్యాల ఆకృతుల నడుమ తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు తెలిపేలా టన్నెల్ విజిట్ ఉంటుంది. రాష్ట్రపతి నిలయంలో ఆనాటి మూడు మెట్ల బావులను సుందరంగా తీర్చిదిద్దారు. ఓ చారిత్రక బావి వద్ద ఎద్దులతో నీటిని తవ్వి.. ఆనాటి మోటబావిని కళ్లకు కట్టేలా నీటిని ఎద్దులతో తోడారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా దీన్ని ప్రదర్శిస్తారు. ఫ్లాగ్ పోస్ట్ వద్ద బర్మాతో చేసిన 125 అడుగుల జెండా పోల్‌ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానాన్ని ఆపరేషన్ పోలో తర్వాత భారత్‌లో విలీనం చేసే సమయంలో ఇక్కడ నిజాంల జెండా కిందకు దించి మువ్వెన్నల పతకాన్ని పైకి ఎగురవేశారు.
చిన్నాపెద్దా అంతా కలసి ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా సేద తీరేలా రాష్ట్రపతి నిలయం ముస్తాబైంది. 8 సంవత్సరాల పైబడిన వారందరకీ 50 రూపాయల టికెట్ కాగా.. ముప్పై మందికి పైగా ఒక గ్రూప్‌గా వస్తే 20 శాతం డిస్కౌంట్ ఇస్తారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఎంట్రీ ఉచితం. visit.rastrapathibhavan.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు దొరుకుతాయి. ఆఫ్‌లైన్‌లోనూ రాష్ట్రపతి నిలయం వద్ద ఎంట్రీ టికెట్లు ఇస్తారు. ఎంతో సువిశాల ఈ రాష్ట్రపతి నిలయం విజ్ఞానం వినోదం పంచేలా పర్యాటకంగా ఆకట్టుకుంటోంది.