Mahesh Babu: జర్మనీ అడవుల్లో బ్రూనెల్లో క్యూసినెల్లి జాకెట్ ధరించిన మహేష్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు..
జక్కన్న, మహేష్ కాంబోలో రాబోయే సినిమాపైనే మరిన్ని అంచనాలు పెరిగాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ సినిమాగా ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జర్మనీ అడవుల్లో మహేష్ శిక్షణ తీసుకుంటున్నాడు. డాక్టర్ హ్యారీ కొనిగ్ వద్ద మహేష్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవలే జర్మనీ అడవులలో మహేష్, డాక్టర్ హ్యారీ కలిసి దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. బ్లాక్ ఫారెస్ట్ లో గడ్డ కట్టే చలలో ట్రెక్కింగ్ అంటూ అసలు విషయం చెప్పేశాడు మహేష్.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇన్నాళ్లు గుంటూరు కారం మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్… ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టాడు. సంక్రాంతి పండక్కి గుంటూరు కారం రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన రీజనల్ సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో జక్కన్న, మహేష్ కాంబోలో రాబోయే సినిమాపైనే మరిన్ని అంచనాలు పెరిగాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ సినిమాగా ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జర్మనీ అడవుల్లో మహేష్ శిక్షణ తీసుకుంటున్నాడు. డాక్టర్ హ్యారీ కొనిగ్ వద్ద మహేష్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవలే జర్మనీ అడవులలో మహేష్, డాక్టర్ హ్యారీ కలిసి దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. బ్లాక్ ఫారెస్ట్ లో గడ్డ కట్టే చలలో ట్రెక్కింగ్ అంటూ అసలు విషయం చెప్పేశాడు మహేష్. ఈ ఫోటోలకు నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేశారు.
ఇధిలా ఉంటే.. డాక్టర్ హ్యారీతో మహేష్ కలిసి ఉన్న ఫోటోలలో సూపర్ స్టార్ బ్రూనెల్లో కుసినెల్లి బ్రాండ్ ధరించాడు. సింపుల్ అండ్ స్టైలీష్ గా కనిపిస్తున్న ఆ జాకెట్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ దాని విలువ ఎంతో తెలుసా ?.. అక్షరాల రూ. 3.18 లక్షలు. బ్రూనెల్లో కుసినెల్లి అనేది ఇటాలియన్ ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్. ఇది గొప్ప నాణ్యత గల దుస్తులు, వస్తువులను రూపొందించడంలో ఖ్యాతిని కలిగి ఉంది. కళ్లు చెదిరే డిజైన్లతో కూడిన ప్రీమియమ్ మెటీరియల్స్ అంటే మహేష్ బాబుకు చాలా ఇష్టం.
View this post on Instagram
మహేష్ బాబు తన ప్రత్యేకమైన డ్రెస్సింగ్ ద్వారా అభిమానుల దృష్టిని ఆకర్షించడంలో ముందుంటారు. సినీ ఈవెంట్లకు.. ఇంటర్వ్యూలకు.. ప్రైవేట్ పార్టీలలో ఎంతో సింపుల్ గా కనిపిస్తుంటారు మహేష్. కానీ ఈ హీరో ధరించే డ్రెస్సులు మాత్రం చాలా ఖరీదైనవి. ఎప్పుడు బెస్ట్ అండ్ స్టైలీష్ డిజైన్ షర్ట్స్, హుడీస్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటారు. ఇక త్వరలోనే ఎస్ఎస్ఎంబీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




