Rebels of Thupakula Gudem OTT: ఓటీటీలో తుపాకుల గూడెం.. నక్సలిజం బ్యాక్ డ్రాప్ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

గతంలో నక్సలిజం బ్యాక్‌ డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ మధ్యన ఇలాంటి సినిమాలు రావడం బాగా తక్కువైపోయింది. కానీ నక్సలిజం నేపథ్యానికి కాస్త సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రం రెబెల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం. జైదీప్‌ విష్ణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రవీణ్‌ కండెల, శ్రీకాంత్‌ రాథోడ్, ప్రముఖ యూట్యూబర్‌ జయేత్రి, వినీత్‌ కుమార్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషంచారు.

Rebels of Thupakula Gudem OTT: ఓటీటీలో తుపాకుల గూడెం.. నక్సలిజం బ్యాక్ డ్రాప్ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Rebels Of Thupakulagudem Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2024 | 5:19 PM

గతంలో నక్సలిజం బ్యాక్‌ డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ మధ్యన ఇలాంటి సినిమాలు రావడం బాగా తక్కువైపోయింది. కానీ నక్సలిజం నేపథ్యానికి కాస్త సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రం రెబెల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం. జైదీప్‌ విష్ణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రవీణ్‌ కండెల, శ్రీకాంత్‌ రాథోడ్, ప్రముఖ యూట్యూబర్‌ జయేత్రి, వినీత్‌ కుమార్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషంచారు. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన తుపాకుల గూడెం ఓ మోస్తరుగా ఆడింది. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం, అదే సమయంలో విరాట పర్వం సినిమా రిలీజ్‌ కావడం తుపాకుల గూడెంకు మైనస్‌గా మారింది. అయితే చూసిన కొందరైనా సినిమా కాన్సెప్ట్‌ బాగుందని కితాబిచ్చారు. ఇప్పుడీ రెబెల్స్ ఆఫ్‌ తుపాకుల గూడెం డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఈటీవీ విన్‌ తుపాకుల గూడెం మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఓటీటీలోకి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది.

తుపాకుల గూడెం అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. నక్సలిజం సమస్యను రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువస్తుంది. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్సలైట్లకు మూడు లక్షల రూపాయలతో పాటు పోలీస్ ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తారు. దీంతో మమతతో తన ప్రేమను గెలిపించుకునేందుకు కుమార్ నక్సలైట్‌గా వేషం మార్చుకుని పోలీసులకు లొంగిపోయే ప్రయత్నం చేస్తాడు. అయితే శివన్న అనే నక్సలైట్ నాయకుడి వల్ల అతడి ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. మరి మమతతో కుమార్‌ ప్రేమ పెళ్లి దాకా వెళ్లిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే రెబెల్స్ ఆఫ్‌ తుపాకుల గూడెం మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..