AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Vyuham: ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. రిలీజ్‌ ఎప్పుడంటే?

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్‌కు మోక్షం లభించింది. రాజకీయ నేపథ్యమున్న ఈ మూవీ రిలీజ్‌కు దాదాపు అన్నీ అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టు సూచనలతో సెన్సార్‌ బోర్డు వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది.

RGV Vyuham: ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. రిలీజ్‌ ఎప్పుడంటే?
Ram Gopal Varma Vyuham Movie
Basha Shek
|

Updated on: Feb 08, 2024 | 4:58 PM

Share

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్‌కు మోక్షం లభించింది. రాజకీయ నేపథ్యమున్న ఈ మూవీ రిలీజ్‌కు దాదాపు అన్నీ అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టు సూచనలతో సెన్సార్‌ బోర్డు వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. దీంతో ఈనెల 16న వ్యూహం సినిమాను విడుదల చేసేందుకు సినిమా నిర్మాత అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న వ్యూహం నవంబర్‌ 10 నే థియేటర్లలో రిలీజ్‌ క ఆవాల్సి ఉంది. అయితే ఇందులో ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులను కించపరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సహా మరికొందరు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వ్యూహం సినిమాను రిలీజ్‌ చేయవద్దంటూ అందులో కోరారు. దీంతో వ్యూహం సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే చిత్రనిర్మాత, దర్శకుడు తదితరులు సినిమా రిలీజ్‌ జాప్యంపై కోర్టును ఆశ్రయించారు. ప్రతిగా పిటిషన్‌లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది. మరోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేట్‌ను జారీ చేయవలసిందిగా ఆదేశించింది. తాజాగా సెన్సార్‌ బోర్డు వ్యూహం సినిమాకు యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’. జగన్‌ పాత్రలో రంగం మూవీ ఫేమ్ అజ్మల్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి పాత్రలో మానస కనిపించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవి పాత్రలు కూడా ఇందులో చూపించారు వర్మ. ఇప్పటికే యాత్ర2 సినిమాతో ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. మరి వారం రోజుల గ్యాప్‌లోనే యాత్ర 2 కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ లో పొలిటికల్‌ డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి. మరి రిలీజయ్యాక ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..