Mrunal Thakur: బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్.. లెజెండ్రీ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ అందుకున్న బ్యూటీ
హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని తో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో ఈ చిన్నదానికి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది మృణాల్.

మృణాల్ ఠాకూర్.. దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది ఈ చిన్నది . బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో జెర్సీ,సూపర్ 30 సినిమాలతో మంచి పాపులారీటీ సొంతం చేసుకుంది మృణాల్. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని తో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో ఈ చిన్నదానికి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది మృణాల్. మృణాల్ ఠాకూర్‌తో సినిమా చేయడానికి పెద్ద నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌కి బాలీవుడ్ నుంచి ఓ బడా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఓ లెజెండ్రీ డైరెక్టర్ సినిమాలో మృణాల్ కు నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. . బాలీవుడ్ లో దేవదాస్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, రామ్ లీలాలాంటి సినిమాలను తెరకెక్కించిన భన్సాలీ డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ అందుకుంది మృణాల్. ఆయన ‘భన్సాలీ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. ఇప్పుడు ‘హిరమండి’ వెబ్ సిరీస్ నిర్మించి విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో పాటు ‘లవ్ అండ్ వార్’ సినిమా కూడా రాబోతోంది. వీటితో పాటు రొమాంటిక్ మూవీ రానుందని, ఇందులో మృణాల్ ఠాకూర్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.
మృణాల్ ఠాకూర్ నటనలో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అందుకే ఆమెను సంజయ్ లీలా బన్సాలీ ఎంపిక చేశారు. ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యావర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుత కాలం నాటి ప్రేమకథ ఈ సినిమాలో చూపించనున్నారు. అలాగే ఇది మ్యూజికల్ మూవీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌తో సిద్ధాంత్ చతుర్వేది నటించనున్నారు. సిద్ధాంత్ చతుర్వేది ఇప్పటికే బాలీవుడ్‌లో ఫేమస్. ‘గల్లీ బాయ్’ సినిమాలో ఆయన చేసిన పాత్ర ఎంతో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రొడక్షన్ హౌస్‌లో నటించే అవకాశం అందుకున్నాడు.
మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







